సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకొచ్చారంటూ చైతూ ఆవేదన

author img

By

Published : Aug 13, 2022, 2:08 PM IST

nagachaitanya
నాగచైతన్య ()

యువహీరో నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వెళ్లడం తననెంతగానో బాధపెట్టిందని అన్నారు.

Nagachaitanya emotional జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు యువహీరో నాగచైతన్య. 'జోష్‌'తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కెరీర్‌ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతగానో బాధపెట్టిందని తాజాగా ఆయన తెలిపారు. ఆ సంఘటన తర్వాతే తాను థియేటర్లకు వెళ్లడం మానేశానంటూ చై చెప్పుకొచ్చారు.

"నా మొదటి సినిమా 'జోష్‌' విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో? నటుడిగా వాళ్లు నన్ను ఎలా స్వీకరిస్తున్నారో చూడాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా ఫస్ట్‌డే థియేటర్‌కు వెళ్లా. సినిమా మొదలైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ, సినిమా సగానికి వచ్చేసరికి ప్రేక్షకులు చాలామంది థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. ప్రేక్షకుల్ని అలరించడానికే నేనిక్కడ ఉన్నా. కానీ అది నా వల్ల సాధ్యం కావడం లేదనిపించింది. ఆ అనుభవం నన్నెంతో భయపెట్టింది. అలాగే నాకెన్నో విషయాలు నేర్పించింది. ఆ తర్వాత నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఎందుకంటే ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్‌లో నుంచి పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నా. తాము నటించిన సినిమా విడుదలైన రోజు నటీనటులందరూ ఎంతో కంగారు పడుతుంటారు. అయినప్పటికీ, థియేటర్‌కు వెళ్లి ఫస్ట్‌ డే మూవీ చూస్తారు. కానీ, నేను అలా కాదు. నాకు కంగారు, భయం ఎక్కువ. కొన్ని సీన్లకు ప్రేక్షకులు నవ్వకపోతే? కొన్ని సీన్లకు ఏ విధంగానూ స్పందించకపోతే? అని ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటా" అని చై వివరించారు.

ఇదీ చూడండి: వెంకటేశ్​ ఆ లాజిక్​ను ఎందుకు మిస్​ అయ్యారో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.