ETV Bharat / sports

కామన్వెల్త్ పతకవిజేతలు దేశాన్ని గర్వించేలా చేశారని మోదీ ప్రశంసలు

author img

By

Published : Aug 13, 2022, 12:48 PM IST

Commonwealth Games PM Modi కామన్వెల్త్​ క్రీడల పతకవిజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు.

PM Modi interacts with Common wealth Games Medallists
పతకవిజేతలకు మోదీ ఆతిథ్యం

Commonwealth Games PM Modi ఇటీవలే కామన్వెల్త్​ క్రీడలు 2022 ఘనంగా ముగిశాయి. అయితే తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల పతక విజేతలకు.. ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.

"కుటుంబసభ్యుల్లా మీరంతా ఇక్కడి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ముందుగా కామన్వెల్త్​లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ, మెడల్స్​ సాధించినవారికి నా అభినందనలు. చారిత్రక ప్రదర్శన చేశారు. నాతో సహా దేశం మొత్తం గర్వపడేలా చేశారు. ఆత్మవిశ్వాసం, ధైర్యమే మీ గుర్తింపు. మీ కృషి, స్ఫూర్తిదాయక విజయంతో దేశం ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లోకి అడుగుపెట్టబోతుంది. గత కొన్ని వారాల ప్రయాణం చూస్తే.. క్రీడల్లో దేశం రెండు భారీ విజయాలను అందుకుంది. ఒకటి కామెన్వెల్త్​లో చారిత్రక ప్రదర్శన చేసింది. రెండోది తొలిసారి చెస్​ ఒలింపియాడ్​ను నిర్వహించింది. చెస్​ ఒలింపియాడ్​ను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మంచి ప్రదర్శనను కొనసాగించాం.వారికి కూడా నా అభినందనలు" అని అన్నారు. కాగా, కామన్వెల్త్​లో భారత్​ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా టీ20 లీగ్​లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.