ETV Bharat / state

వైద్యుల నిర్వాకం... 6 నెలలుగా పొట్టలోనే సర్జికల్ క్లాత్!

author img

By

Published : Feb 14, 2023, 10:08 PM IST

Doctors Negligence: హాస్పిటల్ అంటే రోగుల ఆరోగ్యాన్ని సరిచేసి తిరిగి కొత్త జీవితం ప్రసాదించే ఓ సంజీవని. అలాంటి దానిలో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు ప్రమాదంలో పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది.

నిర్వాకం
నిర్వాకం

Doctors Negligence: వైద్యులు మనకు ఏదైనా అనారోగ్యం వస్తే నయం చేసే దేవుళ్లుగా భావిస్తాం. ఆ డాక్టర్​ని నమ్ముకొని ప్రాణమే అతనికి అప్పచెప్తాం. కాని వారే కోత్త సమస్యకు కారణమైతే.. ఆ రోగి పరిస్థతి ఏంటి..? ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అను హాస్పిటల్​కి ఓ రోగి ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్తే అది నయం చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇంకో కొత్త సమస్య సృష్టించారు. దీంతో ఆ పేషంట్ ఆరోగ్యం విషమంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉన్న అను హాస్పిటల్​కి మచిలీపట్నానికి చెందిన కొరివిడి శివపార్వతి, గర్భసంచి సమస్యతో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు గర్భసంచి తొలగించి వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం 6నెలల తరబడి తరచూ కడుపునొప్పితో బధపడుతూ.. అను హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారని పేషెంట్‌ బంధువులు తెలిపారు.

ఇక ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హరిణి హాస్పిటల్​కి తరలించారు. హరిణి హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేసి అవాక్కయ్యారు. ఎందుకంటే.. అను హాస్పటల్ వైద్యులు ఆపరేషన్ చేసి సర్జికల్ క్లాత్​ను కడుపులోనే మర్చిపోయారు. దీంతో పేషంట్ పొట్టలో ఉన్న సర్జికల్ క్లాత్​ను హరిణి హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేసి బయటికి తీశారు.

ఆపరేషన్ అనంతరం రోగి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన రోగి సంబందీకులు హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ ఆసుపత్రి సిబ్బందితో ఆందోళనకు దిగారు. ఇలాంటి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు ఎలా రక్షిస్తారని రోగి బంధువులు ప్రశ్నిస్తున్నారు.


అను హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన తర్వాత తరచూ శివపార్వతి కడుపు నొప్పితో బాధపడేది ఎన్ని సార్లు ఆసుపత్రికి తిప్పిన అను ఆసుపత్రి వైద్యులు నెమ్మదిగా తగ్గుతుందని చెప్పారు కాని నొప్పి తగ్గలేదు. దీంతో విజయవాడ హరిణి ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు ఆపరేషన్ చేసి పొట్టలో నుంచి 3 సర్జికల్ క్లాత్ బయటికి తీసారు. అలాగే పేగు కుళ్లిపోయిందని.. కుళ్లిపోయిన పేగును తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. -రోగి బంధువులు

వైద్యుల నిర్వాకం... 6 నెలలుగా పొట్టలేనే సర్జికల్ క్లాత్!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.