ETV Bharat / state

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. నవీన్ రెడ్డిపై పోలీసుల పీడీ యాక్ట్?

author img

By

Published : Dec 14, 2022, 11:36 AM IST

Adibatla Kidnapping Case Updates: హైదరాబాద్‌ మన్నెగూడలో దంతవైద్యురాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నవీన్‌రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా.. వరంగల్‌లో రెండేళ్ల క్రితం మరో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారు.

Naveen Reddy
Naveen Reddy

Adibatla Kidnapping Case Updates: హైదరాబాద్ దంతవైద్యురాలి కిడ్నాప్‌ కేసులో పోలీసులునవీన్‌ రెడ్డిని సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకురానున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు రూమెన్, సిద్ధు, చందుని నిన్న ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నవీన్‌ రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. వరంగల్‌లో 2 ఏళ్ల క్రితం నవీన్‌ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు కాగా.. పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారు. కేసులో మొత్తం ఇప్పటి వరకూ పోలీసులు 36 మందిని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్‌ మన్నెగూడకు చెందిన దంతవైద్యురాలికి ఈనెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.

అమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్‌ రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్‌ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.

ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో విహవానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు.

మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్ ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని నవీన్ రెడ్డిని అప్రమత్తంచేశాడు. యువతిని ఇంటి వద్ద వదిలేద్దామని నవీన్‌ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ముగ్గురు మధ్యలో దిగిపోగా మరొక స్నేహితుడు సాయంతో.. దంత వైద్యురాలిని ఇంటికి నవీన్‌ రెడ్డి పంపాడు. మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగానే యువతికి ఫోన్‌ ఇచ్చి.. తన తండ్రికి ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమని సూచించారు.

యువతిని అక్కడే దించేసి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి కారులో పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి.. మన్నెగూడకి వెళ్లి యువతిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా.. ఇప్పటికే ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేశారు. మరో అయిదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇవీ చదవండి: డెంటిస్ట్ అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్‌

డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయిన బస్సు.. చిన్నారి సహా ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.