ETV Bharat / state

Telangana Formation Day 2023 : 'దేశానికే దిక్సూచిగా తెలంగాణ ఎదిగింది'

author img

By

Published : Jun 2, 2023, 4:17 PM IST

Telangana 10th Formation Day Ceremonyతొమిదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణలో.. పాలనకు అనుగుణంగా ఎన్నో నూతన సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అందులో నూతన జిల్లాలు మొదలుకొని.. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్‌. తద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల స్వరూపం మారిపోవడంతో పాటు స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. పదేళ్ల పండుగ ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. 21 రోజులపాటు జరిగే దశాబ్ది వేడుకల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.

Etv Bharat
Etv Bharat

తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది

Decade celebrations of Telangana : నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర పాలనకు అనుగుణంగా.. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చింది సీఎం కేసీఆర్‌ సర్కారు. ప్రజలకు పాలనను దగ్గర చేసేలా.. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా నూతన సంస్కరణలు చేశారు. అందులో మొదట చెప్పుకోవాల్సింది.. జిల్లాల పునర్విభజన. 10జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను 33 జిల్లాల్లుగా విభజించారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. కొత్త పాలనా కేంద్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాయి. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, కార్యాలయాలు, పాలనా భవనాలు పెరిగాయి. ఫలితంగా ఆ ప్రాంతాల స్వరూపం మారిపోయింది.

Telangana Development in 9 Years : 2014 నుంచి క్రమంగా అభివృద్ధి బాటపట్టిన తెలంగాణ రాష్ట్రంలో పంటపొలాలు, స్థిరాస్తిల విలువలు భారీగా పెరిగాయి. భూరికార్డుల సమగ్ర నిర్వహణ కోసం ధరణి పోర్టల్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నా.. అన్నీ సక్రమంగా ఉన్న వారి భూ లావాదేవీలు సాఫీగా సాగే వెసులుబాటు కలిగింది. పచ్చదనం పెంపే లక్ష్యంగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 273 కోట్ల మొక్కలు నాటింది. ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7% పైగా పెరిగింది. తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమించిందనే గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అభివృద్ధి సూచికలుగా ప్రకటించే పలు అవార్డులు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్థూల దేశీయ జాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం సహా అన్నింటా గణనీయమైన వృద్ధి సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతకూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బతుకమ్మ, బోనాల లాంటి పండుగలను ఘనంగా నిర్వహించస్తూ.. చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తోంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇలా అన్ని మతాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుంది. పర్యాటకం విషయంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. చారిత్రక, ప్రముఖ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం సరైన దిశగానే సాగిందని విశ్లేషకులు అంటున్నారు.

Telangana Decade Celebrations 2023 : ఊరూవాడా సంబురం.. అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవం

10th Formation day of Telangana : దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. నేడు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. దేశానికే దిక్సూచిగా ఎదిగింది. ఓ వైపు అభివృద్ధితో పాటు మరోవైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ.. 10ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించింది. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. జూన్‌ 2 జెండా ఆవిష్కరణతో మొదలయ్యే వేడులకు.. 22న అమరుల సంస్మరణతో ముగుస్తాయి. తెలంగాణ ఘన కీర్తిని చాటేలా.. భావితరాలు గుర్తుంచుకునేలా.. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరగనున్నాయి.

"తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రజలు పన్నులు సమయానికి కడుతున్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉంది. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్​ ప్రభుత్వం సంక్షేమంగా అభివృద్ధి చేయించారు."-వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.