ETV Bharat / bharat

ఊటీ సూపర్ టూర్ - బడ్జెట్​ ధరలోనే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ! - మరికొన్ని ప్రదేశాలు కూడా! - Telangana Tourism Mysore Tour

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 9:33 AM IST

Telangana Tourism: మరికొన్ని రోజుల్లో సమ్మర్​ హాలీడేస్​ కంప్లీట్​ కానున్నాయి. ఈ క్రమంలో చాలా మంది టూర్లకు వెళ్లాలని ప్లాన్​ చేస్తుంటారు. మీరు కూడా ఆ లిస్ట్​లో ఉంటే మీ కోసం తెలంగాణ టూరిజం గుడ్​న్యూస్​ చెప్పింది. సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు..

Telangana Tourism
Telangana Tourism Mysore Tour Package (ETV Bharat)

Telangana Tourism Mysore Tour Package: తెలంగాణ టూరిజం.. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి, విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారి కోసం ఎన్నో ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కూడా తక్కువ ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ప్యాకేజీని టూరిస్టుల కోసం తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. సమ్మర్​లో టూరిస్ట్​ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్​ ఆప్షన్​. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ టూరిజం.. బెంగళూరు, మైసూరుతో పాటు ఊటీని చూసేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఈ ప్యాకేజీ ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి జర్నీ ఉంటుంది. రోడ్జు మార్గం(బస్సు) ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఆరు రోజులపాటు సాగే ఈ టూర్​లో ఎన్నో టూరిస్ట్ ప్లేసులను చూడొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

తక్కువ ధరలో సాయి దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ! - telangana tourism packages

హైదరాబాద్ - ఊటీ - మైసూర్ టూర్ ప్రయాణం ఇలా :

  • మొదటి రోజు మధ్యాహ్నం 03.30 గంటలకు హైదరాబాద్​లోని యాత్రి నివాస్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • తర్వాత బషీర్​బాగ్​కు సాయంత్రం 4 గంటలకు చేరుకుని అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరుతుంది. నైట్​ అంతా జర్నీ ఉంటుంది
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. టిఫిన్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది.
  • అక్కడ బుల్​ టెంపుల్​, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, తిపస్ ప్యాలెస్, కబ్బన్​ పార్క్​ చూపిస్తారు.
  • సాయంత్రం తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికే అక్కడే బస ఉంటుంది.
  • మూడో రోజు బెంగళూరు నుంచి ఉదయం 4 గంటలకే ఊటీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఊటీకి చేరుకుంటారు.
  • లంచ్​ తర్వాత దొడబెట్టలోని పలు ప్రాంతాలు చూస్తారు. బోటానికల్ గార్డెన్ సందర్శనతో పాటు పాటు బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు హోటల్​కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస ఉంటుంది.

వీకెండ్​ టూర్​: ఒక్కరోజులోనే 4 ప్రదేశాలు - తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ! - Telangana Tourism Weekend Tour

  • ఇక నాలుగో రోజు ఉదయం 9 గంటలకు ఊటీ నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు మైసూర్​ చేరుకుంటారు. సాయంత్రం బృందావన్​ గార్డెన్​ను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్​కు చేరుకుంటారు.
  • ఐదో రోజు చాముండేశ్వరి ఆలయ దర్శనంతో పాటు మైసూర్ మహారాజ్ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్​ను దర్శించుకుంటారు.
  • మధ్యాహ్నం 12 తర్వాత హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్​కు చేరుకుంటారు. దీంతో టూర్​ పూర్తవుతుంది.

ధరల వివరాలివే: ఈ ప్యాకేజీకి సంబంధించి టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ.11,999గా ఉంది. పిల్లలకు రూ. 9,599గా నిర్ణయించారు. సింగిల్​ ఆక్యూపెన్సీ అయితే 3వేల రూపాయలు అదనంగా చెల్లించాలి. వోల్వో కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, ప్యాకేజీని బుకింగ్​ చేసుకోవడానికి ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అనంతగిరి అందాలు చూసొస్తారా? తక్కువ బడ్జెట్​తో తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ! - Telangana Tourism Ananthagiri Hills

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - యాదాద్రితో పాటు మరో 2 ప్రదేశాలు - టూర్‌ పూర్తి వివరాలివే! - Hyderabad to Yadagirigutta Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.