ETV Bharat / state

మీరు కొన్న మందులు మంచివా నకిలీవా? - తెలంగాణలో ఏం జరుగుతోంది? - గందరగోళంలో ప్రజలు - Fake Medicine in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 10:56 AM IST

Fake Medicine in Telangana : రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి చేస్తున్న దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో పలు సంస్థలు లైసెన్స్​లు లేకుండా మందులను తయారు చేస్తున్నాయని అధికారులు తెలుసుకున్నారు. నకిలీ మందులు సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని చెబుతున్నారు. ఈ నకిలీ మందుల్లో క్యాన్సర్‌ నివారణ మందులూ ఉండడం గమనార్హం.

COUNTERFEIT DRUGS IN TELANGANA
DCA Raids in Telangana (ETV Bharat)

Telangana Pharma Companies Illegal Activities : జ్వరం, దగ్గు, రక్తపోటు, నొప్పులు, మదుమేహం, క్యాన్సర్​ తదితర రోగాలకు మనం వాడుతున్న చాలా మందుల్లో నకిలీవి ఏవో మంచివి ఏవో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్‌మెంట్‌ పని చేస్తోందో లేదోననే ఆందోళన ప్రజల్లో కలుగుతోంది. మందులను విక్రయించే అనుమతిలేని మెడికల్‌ షాపులు అధిక ధరలతో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా తయారైంది.

DCA Raids on Pharma Companies : రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో గత ఏడెనిమిది నెలలుగా డీసీఏ తనిఖీలు నిర్వహిస్తోంది. ఒకవైపు కేసుల నమోదు, నకిలీ మందుల స్వాధీనం వంటివి జరుగుతున్నా మరోవైపు యథేచ్ఛగా అక్రమాలు జరుగుతునే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఔషధాలు రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా వస్తుండగా మరికొన్ని రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.

Fake Medicine in Telangana : హిమాచల్‌ప్రదేశ్, కొత్‌ద్వార్‌, ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్​లలో తయారైన నకిలీ మందులు రాష్ట్రానికి యథేచ్ఛగా వస్తున్నాయని డీసీఏ తెలిపింది. ఈ వ్యవహారంలో భారీ రాకెట్‌ను ఛేదించింది. అక్కడ నుంచి కొరియర్‌ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలుసుకుంది. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తగ్గించేవి ఉన్నాయని పేర్కొంది. ప్రముఖ తయారీ సంస్థలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు నకిలీలను తయారు చేయిస్తున్నారని వెల్లడించింది.

ఈ మందులు వేసుకునేవారు మద్యం తాగకూడదు! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం! - Alcohol Side Effects

Medical shops Running Without Permission : రాష్ట్రంలో లైసెన్సు లేని మెడికల్‌ షాపులు భారీగా వెలుగు చూస్తున్నామని డీసీఏ తెలిపింది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉందని వివరించింది. వివిధ నర్సింగ్‌హోంలు అనుమతి తీసుకోకుండానే మెడికల్‌ షాపులను నిర్వహిస్తున్నాయని వెల్లడించింది. గ్రామాల్లో ఆర్‌ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారని మండిపడింది. ధరల సీలింగ్‌ ఉన్న మందులకు తప్పుడు గరిష్ఠ ధరలను ముద్రిస్తూ 30-40% వరకు అధికంగా తీసుకుంటున్నారని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాలపై ఇటీవల 50కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. మధుమేహం, రక్తపోటు తగ్గిస్తాయని, కిడ్నీలు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లను కరిగిస్తాయని చివరకు క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధుల్నీ బాగు చేస్తాయని ఆయుర్వేద మందులను విక్రయిస్తున్నారని తెలుసుకుంది.

తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు

  • ఫుడ్‌లైసెన్స్‌ అనుమతి తీసుకుని మందు బిళ్లల తయారీ, పెప్టిక్‌ అల్సర్లను, జ్వరాలను తగ్గిస్తాయని పేర్కొంటూ నకిలీ మందుల విక్రయం, ప్రముఖ కంపెనీల దొంగ లేబుళ్లు, అల్యూమినియం ఫాయిల్స్, ఇతర ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీకి ప్రత్యేకంగా వెలిసిన సంస్థలు.
  • ధరల నియంత్రణ ఉన్న మందులను కూడా వారికి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు అమ్ముతున్నారు.
  • అక్రమంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వహణ. అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం.
  • ఇన్సులిన్​ వంటి వాటిని గది ఉష్ణోగ్రత దగ్గరే భారీ పరిమాణంలో నిల్వ ఉంచడం. భారీ పరిమాణంలో ఔషధాలను బిల్లులు లేకుండానే కొనడం. నిబంధనలకు విరుద్ధంగా దగ్గు మందుల నిల్వ, విక్రయం. రూ.లక్షల విలువైన గడువు ముగిసిన మందులు.

Pradhan Mantri Jan Aushadhi : దేశంలో 10,500 ప్రభుత్వ మందుల దుకాణాలు.. సామాన్యులకు చాలా చౌకగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.