ETV Bharat / state

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. నువ్వా-నేనా అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 7:56 AM IST

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇంటింటి ప్రచారాలు, రోడ్‌ షోలతో.. ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. టికెట్‌ దక్కిన నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు.

Telangana Assembly Election Campaign 2023
Telangana Assembly Elections

Telangana Assembly Election Campaign 2023 రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాల జోరు.. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) సమీపిస్తున్న తరుణంలో.. అధికార బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పలువురు యువకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలని.. మంత్రి జగదీశ్‌రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో పార్టీ శ్రేణులకు సూచించారు. దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

BRS Election Campaign in Telangana : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. మెదక్‌లో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌ రెడ్డికి ప్రజలు స్వాగతం పలికారు. రాజకీయ అనుభవం లేకుండా మైనంపల్లి రోహిత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. జిల్లాలో ఉన్న గ్రామాల పరిస్థితి రోహిత్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో చిరుమర్తి లింగయ్య రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ‍శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను లింగయ్య కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్​లో చేరారు.

Jaggareddy on Telangana Congress Manifesto : ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే మేనిఫేస్టోలో ఉన్న హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కొండాపూర్ మండలంలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ప్రచార వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిండమే తన లక్ష్యమని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తెలిపారు. 80 సీట్లు సాధించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Telangana Assembly Election Campaign : రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం.. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

Congress Party Election Camapaign in Telangana : బీఆర్​ఎస్​ను గద్దె దించే సమయం ఆసన్నమైందని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్వలాభం కోసం బీఆర్ఎస్​లో చేరిన సుధీర్​రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని మధుయాస్కీ తెలిపారు. టికెట్ దొరకని కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. మెదక్‌ కాంగ్రెస్‌ పార్టీ(Telangana Congress)అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. వారికి డిపాజిట్లు కూడా గల్లంతయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య.. యాదాద్రిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ప్రజా సమస్యలను మరిచి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.

ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీ నాయకులు వస్తారు : ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వస్తారని.. తర్వాత మాయమవుతారని బీజపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్ అన్నారు. ఉప్పల్, హబ్సిగూడా, చిలుకానగర్ తదితర ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ ప్రచారం నిర్వహించారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్​కు అవకాశం ఇచ్చినా.. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. బీజేపీకు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.

BJP Leaders on Telangana Development : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని జనగామ బీజేపీ అభ్యర్థి దశమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుల్మిట్టలో వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం తమ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ప్రకటనకు మద్దతుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బైక్ ర్యాలీ నిర్వహించారు.

Political Heat in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల జోరు.. పోటాపోటీగా ప్రచారం

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.