ETV Bharat / state

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 8:06 PM IST

Telangana Election Campaign 2023 : పార్టీల అగ్రనేతలు సభలతో జనాల్లోకి వెళ్తుంటే.. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారహోరు పెంచారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. నాయకులు, కార్యకర్తలు ప్రచారం రథాలతో జనాల్లోకి వెళ్తున్నారు. నేతలు విస్తృతంగా జనాల్లోకి వెళ్లి.. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు వివరిస్తున్నారు.

Telangana assembly elections 2023
Telangana Election Campaign 2023

Telangana Election Campaign 2023 రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు

Telangana Election Campaign 2023 : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం (Election Campaign) జోరుగా సాగుతోంది. ప్రజాఆశీర్వాద సభలతో పార్టీ అగ్రనేతలు జానాల్లోకి వెళ్తుంటే.. అభ్యర్థులు సైతం గడగడపకు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ భీఫామ్ ఇవ్వడంతో.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడవాడకు తిరుగుతూ.. మేనిఫెస్టోలో అంశాలు జనాలకు వివరిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, అంబర్‌పేట్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Rahul Gandhi Speech at Peddapalli Sabha : 'ప్రజల తెలంగాణను.. దొరల తెలంగాణగా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు'

BRS Election Campaign 2023 : బాగ్‌అంబర్‌పేట్​లోని రహత్​నగర్, వినాయక్​నగర్‌లలో పార్టీ కార్యకర్తలతో కలిసి కాలేరు వెంకటేశ్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కొంతమంది మైనార్టీ నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. సికింద్రాబాద్.. సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (Talasani Srinivas Yadav) పాదయాత్ర నిర్వహించారు. గడగడపకు వెళ్తూ.. ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గత పది సంవత్సరాల్లో.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు. మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. రానున్న 50 రోజులు ఇక సమరమే

ఆదిలాబాద్‌ జిల్లా మామ‌డ మండ‌లం వాస్తవపూర్ గ్రామానికి వ‌చ్చిన మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డికి పార్టీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. గుస్సాడీ నృత్యంతో, మంగ‌ళ‌ హార‌తులతో, బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో మ‌హిళ‌లు స్వాగ‌తం ప‌లికారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాల‌ని ఆయన ప్రజలను అభ్య‌ర్థించారు. ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టో (BRS Manifesto) నిరుపేద‌ల‌కు వ‌రంగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల‌న్ని నెర‌వేరుస్తామ‌ని ఇంద్రకరణ్​ రెడ్డి మాటిచ్చారు.

Telangana Assembly Elections 2023 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్లబండలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీశ్​ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని గ్రామస్తులు నిలదీశారు. గ్రామస్తులకు నచ్చజెప్పి.. ఎన్నికల ప్రచారం కొనసాగించారు. జనగామ నియోజకవర్గం తరిగోప్పుల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్​రెడ్డి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు.

KTR Tweet on Congress Bus Yatra : 'తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్.. రాహుల్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం'

Congress Election Campaign 2023 : జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan Reddy).. ఇంటింటికీ తిరుగుతూ ఆరు గ్యారెంటీలను (Six Guarantees)ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రూ.500కే సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వివరించారు.. కల్యాణ లక్ష్మీ పథకంతోపాటు నూతన వధువుకు తులం బంగారం అందిస్తామని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముదిరాజులకు ఒక్కస్థానాన్ని ప్రకటించకపోవడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. దుబ్బాకలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన.. కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం.. ప్రచారాలు ప్రారంభించిన నేతలు

Kishan Reddy Counter To Rahul Gandhi Statement : కాంగ్రెస్‌, బీఆర్​ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.