ETV Bharat / state

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : 'కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 5:17 PM IST

Updated : Oct 18, 2023, 9:56 PM IST

CM KCR
CM KCR

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : తాను తీసుకొచ్చే వరకు దేశానికి రైతుబంధులాంటి పథకం తెలియదని కేసీఆర్‌ అన్నారు. రైతులకు రూ.37,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందా అని ప్రశ్నించారు. జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్.. కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంట్‌ కష్టాలు తప్పవని కేసీఆర్ విమర్శించారు.

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు ఎంతో గోసపడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది కూడా హస్తం పార్టీనే అని విమర్శించారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు, పోరాటం చేసి సాధించామని గుర్తు చేశారు. చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కడ తిరిగినా.. తనకు దుఃఖం వచ్చేదని కేసీఆర్‌ (CM KCR) తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయాలని జయశంకర్‌ సార్‌ నాకు సూచించారని అన్నారు. ఇక్కడ తిరిగితేనే తెలంగాణ ప్రజల కష్టాలు తెలుస్తాయని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించానని తెలిపారు. కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నారు కానీ... చేసిందేమీ లేదని కేసీఆర్ ఆరోపించారు.

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

BRS Public Meeting in Jadcherla Today : కృష్ణా జలాల్లో మన హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేశానని కేసీఆర్ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru-Ranga Reddy project) జూరాల నుంచి జలాలు తీసుకోవాలని కొందరు చెప్పారని.. 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి నీరు తీసుకుంటే మనకు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కొందరు నేతలు ఇలాంటి సలహాలే ఇస్తున్నారని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని కేసీఆర్ వెల్లడించారు.

త్వరలోనే పాలమూరు కరవు పూర్తిగా పోతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. 14 నెలల్లోనే లక్షన్నర ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని చెప్పారు. జడ్చర్లను పారిశ్రామిక, ఐటీ రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఒకప్పుడు దుమ్మురేగే దుందుభి నది ఇప్పుడు జీవధారగా మారిందని వివరించారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరిని కడుపున పెట్టుకుని చూసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు.

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్

CM KCR Fires on Congress : కులం, మతం తేడా లేకుండా అన్ని పథకాలు అన్ని వర్గాల వారికి ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. మత సామరస్యానికి ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తాను తీసుకొచ్చే వరకు దేశానికి రైతుబంధులాంటి పథకం తెలియదని పేర్కొన్నారు. రైతులకు రూ.37,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే... మళ్లీ కరెంట్‌ కష్టాలు తప్పవని కేసీఆర్ వివరించారు.

కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు ఎంతో గోసపడ్డాము. ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్‌ సరఫరా లేదు. మోదీ రాష్ట్రంలో కరెంట్‌ కోసం ధర్నాలు జరుగుతుంటాయి. ఎంతో గోసపడిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. - కేసీఆర్‌, ముఖ్యమంత్రి

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం

CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

Last Updated :Oct 18, 2023, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.