ETV Bharat / state

Telangana Assembly Election Campaign : రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం.. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 9:27 PM IST

Telangana Assembly Election Campaign : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు నువ్వా నేనా అన్నట్లు.. విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థులనే గెలిపించాలంటూ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో.. రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Telangana Assembly Election Campaign 2023
Telangana Assembly Election Campaign

Telangana Assembly Election Campaign రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం.. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

Telangana Assembly Election Campaign : టిక్కెట్‌ దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం(Telangana Election Camapaign)లో దూసుకుపోతున్నారు. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత.. మొదటి వార్డులో ప్రచారాన్ని నిర్వహించారు. దివంగత నేత సాయన్న చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మారావు పాదయాత్రను మణికేశ్వర్‌నగర్‌లో స్థానికులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలిపారు. అమీర్‌పేట్‌లో గురుద్వార కమిటీ పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని పాల్గొని.. సనత్‌ నగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నిర్మల్‌లోని బంగల్‌పేట్‌ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలికి చెందిన బీజేపీ యువకులు 100మంది.. ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మెదక్‌ నియోజకవర్గంలోని పాతూరులో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి.. ప్రచారం చేయకుండా యువకులు ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. గిరిజనులకు మాత్రమే పోడు భూమి పట్టాలిచ్చారని.. దళితులకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Telangana Election Campaign 2023 : ప్రచార సందడి షురూ.. ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీలు.. విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం

Assembly Elections in Telangana 2023 : కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో తండ్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రచారాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు స్థానికులు నిరసన తెలిపారు. బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు మంజూరు చేయలేదని యువకులు ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలంలోని పలు గ్రామాల్లో.. తుంగతుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హాలియలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిడమనూరు మండలానికి చెందిన.. పలువురు కాంగ్రెస్‌ నేతలు.. ఎమ్మెల్యే నోముల భరత్‌ సమక్షంలో.. బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్షకులకు కరెంట్ కోతలు తప్పవని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ కాలనీలో.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Congress Party Election Camapaign : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ ఎల్లయ్య, మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ గంగాధర్ రావు పట్వారీ.. మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి వినతి పత్రాన్ని ఇవ్వలేదంటూ.. కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు.

"కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌పై విచారణ చేపడతాము. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించగల మగాడు రేవంత్‌ రెడ్డి మాత్రమే. ఎన్టీఆర్‌ను చిత్తరంజన్‌ దాస్‌ ఓడించినట్లుగా కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను ఓడిస్తాడు." -జీవన్‌రెడ్డి,ఎమ్మెల్సీ కాంగ్రెస్‌

BJP Election Camapaign : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మళ్లీ మాయమాటలతో.. ఓట్లు దండుకునేందుకు బీఆర్‌ఎస్‌ యత్నిస్తోందంటూ.. నిర్మల్‌ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణంతో పాటు సారంగాపూర్, దిలవార్ పూర్ మండలాల నుంచి.. పెద్ద ఎత్తున మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : 'ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం

Kishan Reddy Interesting Comments : 'అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.