ETV Bharat / state

పన్ను ఎగవేతదారులపై పురపాలకశాఖ కొరడా

author img

By

Published : Mar 2, 2020, 5:35 AM IST

పట్టణాలు, నగరాల్లో పన్నుచెల్లించని వారికి నోటీసులు జారీచేయడం సహా సంక్షిప్త సమాచారాలు- ఎస్​ఎమ్​ఎస్​లను అధికారులు పంపనున్నారు. ఎక్కువ బకాయిలు ఉన్న వారి జాబితాను వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో ప్రదర్శించనున్నారు. నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో వందశాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించాలని స్పష్టంచేసింది.

municipality-department-is-taking-action-against-tax-evaders-in-telangana
పన్ను ఎగవేతదారులపై పురపాలకశాఖ కొరడా

రాష్ట్రంలోనిఅన్ని పురపాలికల్లో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. నగర, పురపాలక సంస్థలకు ప్రధాన ఆదాయవనరైన పన్నులను 100శాతం వసూలుచేయాల్సిందేనని.. ఆ విషయంలో గతంలోనే పలుమార్లు ఆదేశాలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

100శాతం పన్నువసూలు చేయాల్సిందే

కొన్ని పురపాలికల్లో కనీసం 30శాతం పన్నులు కూడా వసూలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత వివరాల ప్రకారం రాష్ట్రంలోని పురపాలికల్లో ఆదాయపన్ను ద్వారా రూ. 672 కోట్లు రావాల్సి ఉండగా రూ. 416కోట్లు మాత్రమే వసూలైనట్లు వివరించారు. అన్ని రకాలుగా చూస్తే సగటు పన్నుల వసూలు కేవలం 33 శాతంగా ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక నుంచి పురపాలక శాఖ మంత్రి పన్నుల వసూలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెలాఖరు వరకు 100శాతం పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు.

డిఫాల్టర్లకు ఎస్​ఎంఎస్​ల జారీ

పన్నుల వసూలుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతోపాటు పన్ను చెల్లించాలంటూ డిఫాల్టర్లకు ఎస్​ఎంఎస్​లు పంపాలని అధికారులకు సూచించారు. పురపాలికలోని అన్ని విభాగాల అధికారుల్ని ఆ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేయాలని, ఎక్కువ బకాయిలు ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. అవసరమైతే అధికారులు స్వయంగా బకాయిదార్లతో మాట్లాడాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాల బకాయిలకు సంబంధించి కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. బకాయిదార్లకు నోటీసులు జారీచేయడం, నోటీసు బోర్డుల్లో సహా వైబ్​సైట్​ల్లోనూ వారి పేర్లు ప్రదర్శించాలని తెలిపారు. బకాయిల వసూలుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో నిత్యం సమీక్షించి రోజువారీ ప్రగతిని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని తెలిపారు. వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా అదనపు కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలని కోరారు. పన్నులు వసూలు చేయని మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తప్పవని సత్యనారాయణ హెచ్చరించారు.

పన్ను ఎగవేతదారులపై పురపాలకశాఖ కొరడా

ఇదీ చూడండి: బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.