ETV Bharat / state

డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు - పబ్స్‌ యజమానులు జాగ్రత్త ఉండాలి : హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 11:50 AM IST

Updated : Dec 13, 2023, 1:41 PM IST

Kothakota Srinivas Reddy Takes Charge as Hyderabad CP : గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదని హైదరాబాద్ నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠాలకు ఈ రాష్ట్రంలో చోటులేదని హెచ్చరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారని సీపీ పేర్కొన్నారు. తన శక్తి సామర్థ్యాలు గుర్తించి సీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Kothakota Srinivas Reddy Takes Charge as Hyderabad CP
Kothakota Srinivas Reddy

డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు - పబ్స్‌ యజమానులు జాగ్రత్త ఉండాలి : హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

Kothakota Srinivas Reddy Takes Charge as Hyderabad CP : హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Kothakota Srinivas Reddy)బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి శ్రీనివాస్‌ రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ వచ్చింది. గతంలో ఆయన గ్రే హౌండ్స్ , అక్టోపస్‌లో పనిచేశారు. నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారిగా మంచి పేరు ఉంది. ఇవాళ ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్​ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Kottakota Srinivas Reddy as New CP of Hyderabad : సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠాలకు ఈ రాష్ట్రంలో చోటులేదని హెచ్చరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారన్నారు.

సోషల్ మీడియా వాడకం పట్ల అప్రమత్తత అవసరం- అమ్మాయిలు జర భద్రం : హైదరాబాద్ సీపీ

'నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి ధన్యవాదాలు. హైదరాబాద్ కమిషనరేట్ అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అందరు అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాను. ప్రభుత్వం అన్నివిధాలా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మత సామరస్యానికి పెట్టింది పేరు.' - కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ

Hyderabad CP on Drug Tollywood Drugs Case : సినీ రంగంలో డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం లేకుండా సినిమా పెద్దలు చూడాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా విషయంలో అన్ని వర్గాలతో పాటు సినిమా పెద్దతో కూడా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుందని, ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామని చెప్పారు. ఉద్దేశపూర్వక నేరాలు చేసేవారితో చాలా కరకుగా ఉంటామని స్పష్టం చేశారు. అంతకు ముందు సీపీ సందీప్‌ శాండిల్యకు నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు నూతన సిపికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

'డ్రగ్స్​ను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కోరారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్​తో సమన్వయం చేసుకుంటాం. డ్రగ్స్ సరఫరా చేసే వారికి హైదరాబాద్​లో చోటు లేదు. బార్స్, పబ్స్, ఫార్మ్ హౌస్​లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మాదక ద్రవ్యాల సరఫరా జరగకుండా యజమానులు జాగ్రత్తగా ఉండాలి' - కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యాకు అస్వస్థత

Last Updated :Dec 13, 2023, 1:41 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.