ETV Bharat / state

ధరణిపై ఈ నెల 11న పూర్తి సమాచారం ఇస్తాం : కోదండ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 7:46 PM IST

Kodanda Reddy on Dharani in Telangana : గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ చిన్న, సన్నకారు రైతులకు గుదిబండగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ధరణి ప్రక్షాళనకు తమ సర్కార్‌ తీవ్రంగా కృషి చేస్తుందని వెల్లడించారు. సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన నిర్వహించిన ధరణి అధ్యయన కమిటీ సమావేశానికి హాజరయ్యారు. తదుపరి మీటింగ్​ను ఈ నెల 22కి వాయిదా వేశామని వెల్లడించారు.

Telangana Government Committee on Dharani
Kodanda Reddy on Dharani in Telangana

Kodanda Reddy on Dharani in Telangana : ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వం అనేక సమస్యలను తెచ్చి పెట్టిందని ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఇవాళ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. తదుపరి మీటింగ్​ను ఈనెల 22కి వాయిదా వేసింది. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల రైతుల భూమి మాయమైందని కోదండరెడ్డి పేర్కొన్నారు. ధరణి సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వేగంగా స్పందించి కమిటీ వేశారన్నారు. ధరణి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని కోదండరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వివరించారు.

ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత

Telangana Government Committee on Dharani Portal : గత ప్రభుత్వాల భూమి రికార్డులు అన్ని విషయాలు సేకరించి పరిశీలిస్తున్నామని కోదండరెడ్డి అన్నారు. సోమవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై(Next Meeting of Dharani Committee in Telangana) ప్రజల ముందు ధరణిలో ఉన్న లోపాలను చూపిస్తామని అన్నారు. దానితో పాటు సీసీఎల్​ఓ కార్యాలయంలో తమ కార్యచరణను రైతాంగానికి వివరిస్తామని తెలిపారు. ఈ నెల 11న ధరణి పోర్టల్​ పూర్తి వివరాలతో క్లుప్తంగా సమస్యలను, కార్యచరణను చెబుతామని అంతవరకు వేచి ఉండాలని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని ఏమి లేదని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

"భూముల రికార్డుల ప్రక్షాళనలో గత ప్రభుత్వం సమస్యలను ఇంకా ఎక్కువ చేసింది. రైతులకు భూసమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చాం. దానికి అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నిశితంగా పరిశీలిస్తున్నాం. సోమవారం మరోసారి సీసీఎల్‌ఏ సమావేశం అవుతుంది. ఆ మీటింగ్​ ధరణిలోని లోపాలు, మా కార్యచరణ పూర్తిగా వివరిస్తాం."- కోదండరెడ్డి, ధరణి కమిటీ సభ్యుడు

Dharani Portal Committee Meeting Today : కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడిన తరవాత 2024 జనవరి 10న ధరణి అవకతవకలపై ప్రభుత్వం కమిటీ వేసింది. భూ పరిపాలన ప్రదాన కమిషనర్​ నవీన్​ మిత్తల్​కు కన్వీనర్​గా బాధ్యతలు అప్పగించింది. రైతు సమస్యలపై అవగాహన ఉన్న కిసాన్ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి(Congress Leader Kodanda Reddy)తో సహా మరో ముగ్గురిని సభ్యులుగా స్థానం కల్పించింది. రాష్ట్రంలో పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించింది.

ధరణిపై ఈ నెల 11న పూర్తి సమాచారం ఇస్తాం కోదండరెడ్డి

ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక కోసం రెవెన్యూ శాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.