ETV Bharat / state

ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 7:14 AM IST

Updated : Jan 10, 2024, 7:24 AM IST

Telangana Government Committee on Dharani Portal : ధరణి అవకతవకలపై ప్రభుత్వం కమిటీ వేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కన్వీనర్‌గా పనిచేసే ఈ కమిటీలో మరో నలుగురు సభ్యులు ఉంటారు. ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతలను కమిటీకి అప్పగించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది.

Govt Announces Committee on Dharani Portal
Committee on Dharani Portal

ధరణిపై కమిటీ భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు

Telangana Government Committee on Dharani Portal : భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌పై(Dharani) ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్.కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేసిన రేమండ్‌ పీటర్‌లకూ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్‌, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌లను కూడా కమిటీలో నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం(Telangana Govt) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్షలు నిర్వహించింది.

Five Members Committee on Dharani Portal : ధరణి స్థానంలో ‘భూమాత’ను(Bhoomatha) తీసుకొస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ముందుగా సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైన పోర్టల్‌కు చికిత్స చేస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదని, రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్‌ను పునర్నిర్మించాలని నిర్ణయించారు.

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన మొదలైంది - వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : పొంగులేటి

2020 అక్టోబరు 29న ధరణిని (Dharani Portal) గత ప్రభుత్వం ప్రారంభించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు - మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ కొనసాగుతోంది. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోర్టల్‌లో కూడా పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్‌ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించారు.

Dharani Portal in Telangana : భూ సంబంధిత సమస్యలపై కమిటీ జిల్లాల్లోనూ పర్యటించనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుక్కొని, పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

Last Updated : Jan 10, 2024, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.