ETV Bharat / state

Telangana Decade Celebrations Schedule : దశాబ్ది వేడుకల షెడ్యూల్​ను ప్రకటించిన కేసీఆర్

author img

By

Published : May 25, 2023, 9:09 PM IST

Telangana Decade Celebrations Schedule : నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈక్రమంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్​ను అధికారులకు సీఎం వివరించారు.

Telangana Decade Celebrations Schedule
Telangana Decade Celebrations Schedule

Telangana Decade Celebrations Schedule : హైదరాబాద్​లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. జూన్ 2 నుంచి 22 వరకు మూడు వారాల పాటు సాగే.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్​ను అధికారులకు వివరించారు. ఈ దిశగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. జూన్ 2న కేసీఆర్ గన్​పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం నూతన సచివాలయంలో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. దశాబ్ది ఉత్సవ సందేశంను ఇస్తారు. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలను ఇవ్వనున్నారు.

జూన్​ 3 నుంచి జూన్​ 22 వరకు దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ :

  • జూన్ 3న.. తెలంగాణ రైతు దినోత్సవం..

రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల అన్నదాతలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ క్లస్టర్​లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరిస్తారు.

  • జూన్ 4న.. సురక్షా దినోత్సవం

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని.. సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలీసుశాఖ సాధించిన ఘనతలు, విజయాలు ప్రజలకు తెలియజేసేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

  • జూన్ 5న.. తెలంగాణ విద్యుత్​ విజయోత్సవం

నియోజకవర్గ స్థాయిలోని అన్నదాతలు, వినియోగదారులు.. విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పులను వివరిస్తారు.

  • జూన్ 6న.. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభల్లో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయనున్నారు.

  • జూన్ 7న.. సాగునీటి దినోత్సవం

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేస్తారు.

  • జూన్ 8న.. ఊరూరాచెరువుల పండుగ

గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో.. గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొంటారు.

  • జూన్ 9న - తెలంగాణ సంక్షేమ సంబురాలు

నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకంను ప్రారంభిస్తారు.

  • జూన్ 10న.. తెలంగాణ సుపరిపాలన దినోత్సవం - పరిపాలన సంస్కరణలు, ఫలితాలు

అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.

  • జూన్ 11న - తెలంగాణ సాహిత్య దినోత్సవం

రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారు. రవీంద్రభారతిలో గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంను నిర్వహిస్తారు.

  • జూన్ 12న.. తెలంగాణ రన్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో.. యువకులు, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమంను నిర్వహించనున్నారు.

  • జూన్ 13న.. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

నియోజకవర్గం కేంద్రంలో మహిళా సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు.

  • జూన్ 14న.. తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం

హైదరాబాద్​ నిమ్స్​లో.. ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన 2000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

  • జూన్ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధి వివరాలను ప్రకటిస్తారు.

  • జూన్ 16న.. తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం

ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని వివరాలను ప్రకటించాలి.

  • జూన్ 17న.. తెలంగాణ గిరిజనోత్సవం

ఆయా గిరిజన గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయనున్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి.

  • జూన్ 18న తెలంగాణ మంచి నీళ్ల పండుగ

ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్లను సందర్శించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరు సరఫరా అవుతున్న తీరును వివరిస్తారు.

  • జూన్ 19న.. తెలంగాణ హరితోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరిస్తారు.

  • జూన్ 20న.. తెలంగాణ విద్యాదినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఉదయం జెండా వందనం చేస్తారు. తదనంతరం నిర్వహించే సభల్లో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రస్తావిస్తారు.

  • జూన్ 21న.. తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలను అలకరించనున్నారు. దేవాలయాల్లో వేద పారాయణం.. మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

  • జూన్ 22న అమరుల సంస్మరణ

జూన్ 22వ తేదీన అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హైదరాబాదు ట్యాంక్ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

ఇవీ చదవండి: KCR Review on Early Paddy Crop Cultivation : ముందస్తు వరి సాగుపై అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశం

కాళ్లు, చేయి లేకున్నా సివిల్స్​లో విజయం.. దివ్యాంగుల అద్భుత ప్రతిభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.