ETV Bharat / spiritual

ఈ వారం టూర్​కు ఆ రాశి వారు​- హనుమాన్ గుడికి వెళ్తే మంచిది! - Weekly Horoscope

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 5:10 AM IST

Weekly Horoscope From May 26th to June 1st 2024 : 2024 మే 26వ తేదీ నుంచి జూన్​ 1వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (Source : ETV Bharat)

Weekly Horoscope From May 26th to June 1st 2024 : 2024 మే 26వ తేదీ నుంచి జూన్​ 1వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు తమ వృత్తి వ్యాపారాలలో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిత్రుల సహాయంతో లాభదాయకమైన ప్రణాళికను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ లక్ష్య శుద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ప్రభుత్వ పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారం అందుకుంటారు. మెరుగైన ఆదాయ వనరులను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో దేశవిదేశాలలో పర్యటిస్తారు. సంతానం అభివృద్హికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీ పిల్లల ఉన్నతి సమాజంలో మీకు మరింత గౌరవాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం అన్నివిధాలా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం అద్భుతమైన అవకాశం ఉంటుంది. లక్ష్య సాధనలో ఆరోగ్య సమస్యలు ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి సంబంధించిన పనులు వారం చివరిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కృషికి తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సన్నిహితులతో పాటు, మీ కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకుంటే మంచిది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్, కమీషన్లు రంగం వారికి అదృష్ట దాయకంగా ఉంటుంది. ఈ వారంలో బంధుమిత్రుల ఇంట్లో శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శుభ సమయం నడుస్తోంది. గొప్ప శుభవార్తలను వింటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి శుభ సమయం. మీరు కోరుకున్నఆర్ధిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇంటి మరమ్మతుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులు భాగస్వాములతో సమయానుకూలంగా మాట్లాడుతూ సంయమనం పాటించడం అవసరం. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వాహనగండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మేలు. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. నైపుణ్యాలు మెరుగుపరచుకోకుంటే నిందలు పడాల్సి వస్తుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే కష్టాలు తొలగుతాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు బదిలీ, ప్రమోషన్‌ను అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో ఉండడం వలన కలహాలు రావు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించడం అవసరం. పనులన్నీ సకాలంలో పూర్తి కావాలంటే తీవ్రమైన కృషి అవసరం. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడవచ్చు. వాదనలు తగ్గించి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తే మేలు. తీర్ధయాత్రలు చేస్తారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : ఈ వారం తులా రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, కుటుంబ వ్యవహారాల్లో సర్వత్రా విజయం ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి శుభసమయం. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్ట సమయం నడుస్తోంది. తిరుగులేని విజయాలను సాధిస్తారు. శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సహకారంతో కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పెద్దల సహకారంతో వృద్ధి చెందుతాయి. సంతానం పురోగతి పట్ల సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక లాభాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించండి. గృహంలో శాంతి, సంతోషం నెలకొల్పడానికి కృషి చేస్తారు. స్థిరాస్తి రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడుతారు. బంగారం వెండి వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కావాలంటే అదనపు వనరులు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం. ఉద్యోగులు అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సంపూర్ణ సహకారం అందుతుంది. బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూసే వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. భూవివాదాలలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు మీ పక్కనే ఉంటారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొల్పడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలోని వారు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి చూస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. జీవిత భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన విశ్వాసం పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతులను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శివాష్టకం నిత్య పారాయణ చేస్తే అవాంతరాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధన పట్ల దృష్టి మరల్చకుండా జాగ్రత్త పడాలి. ప్రాధాన్యత లేని అంశాలను, ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. వ్యాపారంలో పురోగతి లేక డబ్బు ఆగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూస్తారు. ఆర్ధిక వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక సమస్యలను మరింత దిగజార్చుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. మీరు ఊహించని ప్రదేశానికి బదిలీ కావడం ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. పని నుంచి కొంత విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోండి. సంకట మోచన హనుమాన్ ఆలయ సందర్శన చేస్తే ఆపదల నుంచి బయట పడవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.