ETV Bharat / spiritual

ఆ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది- ఆదాయానికి మించి ఖర్చులు! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 5:00 AM IST

Horoscope Today May 26th 2024 : మే​ 26న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Source : ETV Bharat)

Horoscope Today May 26th 2024 : మే​ 26న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శివారాధనతో అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పదు. ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. వ్యాపారులకు పోటీదారుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. లాభాలు ఆశించిన మేరకు ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గృహంలో కలహాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా వచ్చే సూచన ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి మీరు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఉత్సాహంగా సంతోషంగా గడిచిపోతుంది. బంధువర్గంలో, సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు లక్ష్మీకటాక్షం ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలను గడిస్తారు. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ పనితీరుకుపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు ఈ రోజు చేసే అన్ని పనుల్లో విజయం ఉంటుంది. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు ఏర్పాట్లు చేస్తారు. కళాకారులకు సినీరంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సోమరితనం, బద్దకంతో పనులన్నీ వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ఆరోగ్యం సహకరించదు. ఇంట్లో గొడవల కారణంగా ప్రశాంతత ఉండదు. ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలను పొందవచ్చు.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. పర్యటక ప్రదేశాలను సందర్శిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. దైవబలం అండగా ఉంటుంది. అన్ని రంగాల వారు తాము ఎంచుకున్న రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి అంశాలు ఉద్యోగులను సంతోషంలో ముంచెత్తుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. గణపతి ప్రార్థన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉన్నతమైన మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారులు గొప్ప లాభాలను అందుకుంటారు. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ అవసరం. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. బంధువుల ఇంట శుభకార్యాలకు వెళతారు. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. గురుగ్రహ శ్లోకాలు చదువుకుంటే శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ ఆచి తూచి ముందడుగు వేస్తే మేలు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ధార్మిక, సామాజిక కార్యకలాపాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సమీప బంధువులతో గొడవలు ఉండవచ్చు. శని స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. వృత్తి వ్యాపార నిపుణులకు అదృష్టం వరిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి లాభాల పంట పండుతుంది. అమ్మకాలు, కొనుగోలు ఊపందుకుంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి. శివాష్టకం పఠిస్తే మేలు కలుగుతుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మీకు ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడిపోతారు. ప్రతికూల ఆలోచనలతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. మనోబలం పెంచుకోండి. లేకుంటే మీ శత్రువుల నుంచి ముప్పు ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.