ETV Bharat / state

GHMC: రూ.5,600 కోట్లతో బల్దియా బడ్జెట్.. ఆమోదించిన సభ్యులు

author img

By

Published : Jun 29, 2021, 11:49 AM IST

Updated : Jun 29, 2021, 2:26 PM IST

2021-22 ఆర్థిక సంవత్సర వార్షిక పద్దుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా జీహెచ్​ఎంసీ నిర్వహించిన సర్వసభ్య సమావేశం ముగిసింది. మేయర్​ విజయలక్ష్మి అధ్యక్షతన... కార్పొరేటర్లు, ఎక్స్​అఫిషియో సభ్యులు వర్చువల్​గా పాల్గొన్నారు. బడ్జెట్​పై చర్చ అనంతరం ఆమోద ముద్ర వేశారు. బల్దియా చరిత్రలో తొలిసారిగా సమావేశం వర్చువల్​గా జరిగింది.

GHMC Plenary Session
సర్వసభ్య సమావేశం ప్రారంభం

జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ఆధ్వర్యంలో తొలి సర్వసభ్య సమావేశం (GHMC Plenary Session) జరిగింది. మేయర్​ విజయలక్ష్మి (GHMC Mayor Vijaya Lakshmi) అధ్యక్షతన... తొలిసారి వర్చువల్​ విధానంలో చర్చ నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్​అఫిషియో సభ్యులు పాల్గొన్నారు. స్థాయీ సంఘం గతేడాది డిసెంబరులో ఆమోదించిన 2021-22 ఆర్థిక సంవత్సరం(Financial year) పద్దును ఆమోదించడమే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది.

జనవరిలోనే ఆమోదం పొందాలి కానీ..

షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది జనవరిలో ఈ పద్దు ఆమోదం పొందాలి. కొత్త పాలక మండలికి అదే సమయంలో ఎన్నికలు జరగడంతో సమావేశం వాయిదా పడింది. అనంతరం కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి కారణంగా సమావేశం జరగలేదు. వ్యాప్తి తగ్గుముఖం పడటంతో... తాజాగా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి వర్చువల్‌ పద్ధతిలో సమావేశం నిర్వహించి... రూ.5,600 కోట్ల పద్దును ప్రవేశపెట్టారు. సమగ్ర చర్చల అనంతరం సభ్యులు పద్దుకు ఆమోదం తెలిపారు.

కొవిడ్​ దృష్ట్యా సర్వసభ్య సమావేశాన్ని తొలిసారి వర్చువల్​గా నిర్వహించాం. కార్పొరేటర్ల జాగ్రత్త కోసం సమావేశం వర్చువల్​గా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. రూ. 5,600 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఇదే కాకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం.

-జీహెచ్​ఎంసీ మేయర్, విజయ లక్ష్మీ

పద్దుపై చర్చ పూర్తి అయిన అనంతరం నగరంలోని సమస్యలు, వర్షాకాలంలో తలెత్తనున్న ఇబ్బందులు, నాలాలు, చెరువుల సమస్యపై చర్చ జరిపారు. జులై 1 నుంచి 10 రోజుల పాటు జీహెచ్ఎంసీ(GHMC)లో పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నట్లు మేయర్(Mayor) పేర్కొన్నారు.

సర్వసభ్య సమావేశం

ఇదీ చూడండి: కొవిడ్​ కాలంలో మధుమేహాన్ని నియంత్రించండి ఇలా!

Last Updated :Jun 29, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.