ETV Bharat / state

Covid Employment: కరోనా వేళ కార్మికులకు అండ.. చేనేత ఉత్పత్తుల ప్రదర్శన

author img

By

Published : Jan 22, 2022, 5:26 AM IST

Covid Employment: కరోనాతో దెబ్బతిన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో చేనేత సంతను ఏర్పాటుచేసి ఉత్పత్తుల విక్రయానికి ఓ వేదిక కల్పించింది. భాగ్యనగర వాసులు నాణ్యమైన చేనేత వస్త్రాలు తక్కువధరకే కొనుగోలు చేసేందుకు ఆ సంతవేదికగా నిలుస్తోంది.

Covid Employment
హైదరాబాద్‌లో చేనేత సంత

Covid Employment: చేనేత కార్మికుల కష్టానికి ఫలితం లభిస్తున్న తరుణంలో కరోనాతో ఆ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. అనేక కుటుంబాల్లో పూటగడవని పరిస్థితి నెలకొంది. ఇటీవలే చేనేత రంగం కోలుకుంటున్న వేళ కొవిడ్‌ మళ్లీ కలవరపెడుతోంది. అది గమనించిన చేనేత చైతన్య వేదిక నిర్వాహకురాలు తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలో చేనేత సంత ఏర్పాటు చేయించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. అందమైన చీరలు, వస్త్రాలు, మగ్గంపై అద్భుతంగా నేసిన కర్ణాటక ఇల్క, కోరాపుట్‌, చందేరి, వెంకటగిరి, గద్వాల్‌, పోచంపల్లి, ఇక్కత్‌..... ఇలా ఎన్నో రకాల చేనేత వస్త్రోత్పత్తులు సంతలో కొలువుదీరాయి.

చేనేత కార్మికుల హర్షం

handloom workers: కరోనా కష్టకాలంలో ఇళ్లకే పరిమితంకాకుండా నగరం తీసుకొచ్చి తమ వస్త్రాలు విక్రయించేందుకు వేదిక కల్పించడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాలు బాగున్నాయని అనేక మందికి ఉపాధి దొరుకుతోందని సంతోషపడుతున్నారు.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో చేనేత సంత ఏర్పాటు

సంప్రదాయ ఎంపిక కోసం అందమైన చీరలు, వస్త్రాలు కొలువుతీరాయి. వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు సమీపిస్తుండటంతో వధూవరులకు అవసరమైన అందమైన మిరుమిట్లు కొలిపే కళ్యాణ వస్త్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అద్భుతంగా మగ్గంపై నేసిన గొల్లభామ, నారాయణపేట, ఇక్కత్, మంగళగిరి, కలంకారి, పెన్ కలంకారి, గోదావరి చీరెలు, చీరాల, గద్వాల్, చీరాల చీరలు, గుంటూరు ఖాదీ, చేనేత వస్త్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి యోగా మ్యాట్లు, టవళ్లు, కర్చీఫ్‌లు, ఇకో బంజారా, చేతివృత్తులు సైతం కొనుగోలు చేసేందుకు నగరవాసులు మంచి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నల్గొండ తదితర జిల్లాల నుంచి చేనేత కార్మికులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు. చేనేత పనితనానికి అద్దంపట్టే రీతిలో రూపొందించిన చీరలు, ఇతర వస్త్రాలకు నగరవాసుల ఆదరణ చూరగొంటున్నాయి. కోవిడ్ కష్టకాలంలో తాము ఇళ్లకే పరిమితం కాకుండా నగరం తీసుకుని ఉచితంగా స్టాల్ ఇప్పించి వ్యాపారం చేసుకోవడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పనకు ఎన్జీఓ చేసినందుకు అమ్మకాలు బాగున్నాయని చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

రెండు రోజుల పాటు ప్రదర్శన

జంట నగరవాసులు ప్రదర్శనను సందర్శించి. అద్భుత కళారూపాలను చూసి మురిసిపోతున్నారు. నచ్చిన వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. చేతివృత్తులను ప్రోత్సహించేలా మరింత మంది ప్రదర్శనకు రావాలని పిలుపునిస్తున్నారు. రెండు రోజులపాటు ఆ సంత జరుగుతుందన్న నిర్వాహకులు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.