ETV Bharat / city

హైదరాబాద్​లో గాలి నాణ్యత పెంపు కోసం కమిటీ ఏర్పాటు

author img

By

Published : Jan 21, 2022, 6:24 PM IST

Air Quality Monitoring Committee: 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు హైదరాబాద్​లో గాలి నాణ్యత పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​​ కుమార్​ నేతృత్వంలో అమలు కమిటీనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిధుల వినియోగం, గాలి నాణ్యత పర్యవేక్షణ తదితర అంశాలపై కమిటీ ఎప్పటికప్పడు దృష్టి సారించాల్సి ఉంటుంది.

Committee for Air Quality Improvement in Hyderabad
Committee for Air Quality Improvement in HyderabadCommittee for Air Quality Improvement in Hyderabad

Air Quality Monitoring Committee: హైదరాబాద్​లో గాలి నాణ్యత పెంపు కోసం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మిలియన్ ప్లస్ సిటీస్​లో భాగంగా.. నగరంలో గాలి నాణ్యత కోసం వివిధ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.234 కోట్ల మేర నిధులు వస్తాయి. కార్యక్రమాన్ని కాలుష్య నియంత్రణ మండలి ద్వారా పర్యావరణశాఖ అమలు చేయాల్సి ఉంటుంది. పురపాలకశాఖ నేతృత్వంలో చర్యలు, జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది.

దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ నేతృత్వంలో అమలు కమిటీనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్, రవాణాశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలకశాఖ సంచాలకులు, వాణిజ్య-వ్యాపార సంస్థల ప్రతినిధి.. ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలును కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. నిధుల వినియోగం, గాలి నాణ్యత పర్యవేక్షణ తదితర అంశాలపై ఎప్పటికప్పడు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ మేరకు పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.