ETV Bharat / state

మాస్కు ధరించడం మరవద్దు: డీహెచ్ శ్రీనివాసరావు

author img

By

Published : Apr 21, 2022, 3:21 PM IST

Updated : Apr 22, 2022, 4:41 AM IST

DH on Vaccine
వ్యాక్సిన్

15:19 April 21

DH on Vaccine: ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్‌

ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్‌

DH on Vaccine: రాష్ట్రంలో 18-59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు పంపిణీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ చర్యల వల్ల కొంతవరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 18-59 ఏళ్ల వయసు వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్‌ డోసు తీసుకోవాలని డీహెచ్ వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని డీహెచ్‌ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలోని 12-17 ఏళ్ల వయసు వారు రెండో టీకా తీసుకోవాలని తెలిపారు. రెండో టీకా తీసుకొని 9 నెలల పూర్తయిన వారు మూడో డోసు తీసుకోవాలని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పూర్తయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని డీహెచ్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించకుండా ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలని డీహెచ్‌ సూచించారు. వంద శాతం జనాభాకు రెండు డోసుల టీకా పంపిటీ పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

కరోనా కేసులు పెరిగే అవకాశం: ప్రజల సహకారంతో రెండు దశల్లోనూ కరోనాను సమర్ధంగా నియంత్రించగలిగామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్‌ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చని ఆయన వెల్లడించారు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా ఫ్లూ లాగా మారే అవకాశముందని డీహెచ్‌ అంచనా వేశారు. రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అక్కర్లేదు డీహెచ్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాబోయే 4 నుంచి 6 వారాల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశముందని తెలిపారు.

కొన్నిచోట్ల నాలుగో వేవ్ ప్రారంభం: కొన్ని చోట్లా నాలుగో వేవ్ ప్రారంభమైందని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. చైనా, తైవాన్, ఈజిప్టులో కేసులు పెరుగుతున్నాయని డీహెచ్‌ వెల్లడించారు. మనదేశంలోని దిల్లీ, హరియాణా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దిల్లీలో పాజిటివిటి రేటు 4 శాతానికి చేరిందని.. తెలంగాణలో పాజిటివిటి రేటు పెరగలేదని స్పష్టం చేశారు. గత ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులో వుందని డీహెచ్‌ పేర్కొన్నారు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం: మూడో వేవ్ నుంచి మనం ఇప్పుడిపుడే కోలుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణలో నాలుగో వేవ్ రాకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ వరకు పెళ్లిళ్లు, విహారయత్రాలు ఎక్కువగా ఉన్నందున వచ్చే మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలందరూ పాటించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ గణనీయంగా సాగుతోందని తెలిపారు. ఎన్‌ఐఎన్ సీరో సర్వేలో సెరో పాజిటివిటీ 92.9 శాతంగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో సెరో పాజిటివిటీ 95 శాతంగా ఉన్నట్లు డీహెచ్‌ వివరించారు. ఆరోగ్య కార్యకర్తల్లో 92.8 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

" థర్డ్‌ వేవ్‌, వస్తుందో రాదో తెలియని ఫోర్త్ వేవ్‌ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే. అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో 106 శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చాం. రెండో డోసు కూడా వంద శాతం మంది వేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల అప్రమత్తత కారణంగా థర్డ్‌ వేవ్‌లో తక్కున నష్టంతో బయటపడ్డాం. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదంటే వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒక్కటే మార్గం. 60 ఏళ్ల పైబడిన వారికి అన్ని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్‌ డోసు ఇస్తున్నాం. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలి"

- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఆ సమయంలో బయటకు రావద్దు: రాష్ట్రంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2 నుంచి సాయంత్రం 4 వరకు ఎవరూ బయటకు రావద్దని డీహెచ్‌ హెచ్చరించారు. ప్రజలు లేత రంగు దుస్తులు, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల నీరు తాగాలని డీహెచ్‌ వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, సెలైన్లు అందుబాటులో ఉంచామని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇవీ చూడండి: Revanth tweet: ఆ జీవో చెల్లదు.. అందుకోసమే కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి

Last Updated :Apr 22, 2022, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.