ETV Bharat / state

గాంధీభవన్​లో రేపు పీఏసీ సమావేశం - ఆ అంశాలపై కీలక చర్చ!

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 5:10 PM IST

Congress PAC Meeting at Gandhibhavan
Congress PAC Meeting in Telangana

Congress First PAC Meeting in Telangana After Elections : రేపు కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీలో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలోనే నామినేటెడ్‌ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Congress First PAC Meeting in Telangana After Elections : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారిగా పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం(Congress PAC Meeting) జరగనుంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమావేశమవుతుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. పీఏసీ సమావేశంలోనే నామినేటెడ్‌ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా హాజరకానున్నారని సమాచారం.

కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల కోసం పోటీ - సర్దుబాటుపై స్వయంగా సీఎం రేవంత్‌ ఫోకస్

CM Revanth Reddy Attend PAC Meeting in Hyderabad : సోమవారం జరిగే పీఏసీ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మిగిలిన ఎమ్మెల్సీ పదవులపై చర్చ(Discussion on MLC Posts in Telangana)జరిగే అవకాశం ఉందని సమాచారం. నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరుగుతున్న సమావేశం అయినందున ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించేలా చర్చించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Congress PAC Meeting in Hyderabad : ప్రభుత్వ పథకాలు(Telangana Government Schemes) రాష్ట్రంలో సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వానికి అనుసంధానంగా చర్యలు తీసుకునేలా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు ఏ విధంగా పార్టీ పని చేసిందో, అలానే మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేలా నాయకుల మధ్య చర్చ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ 'విరాళాల' బాట- లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధం- పార్టీ ఆవిర్భావం రోజునే!

Congress Leaders Discuss on Nominated Posts in PAC Meeting : కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల ప్రజలకు లాభం జరగుతుందో లేదో తెలుసుకునేందుకు, ప్రతి ఒక్కరికి వాటి గురించి తెలిసేలా జిల్లా స్థాయిలో నాయకులను ఏర్పాటు చేసేందుకు చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) హాజరుకావడంతో గాంధీభవన్‌కు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు చర్చించుకున్న అంశాలను మీటింగ్‌ ముగిసిన అనంతరం మీడియాకు తెలియజేయనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ

ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.