ETV Bharat / state

Congress Latest News : కారు స్పీడ్​కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు

author img

By

Published : Aug 4, 2023, 7:18 AM IST

Updated : Aug 4, 2023, 7:59 AM IST

Congress Candidates Telangana Assembly Elections 2023 : శానససభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన పార్టీ.. అందుకు సంబంధించి ఇవాళ కార్యాచరణ ఖరారు చేయనంది. రేపు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Congress
Congress

అభ్యర్ధుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించిన హస్తం పార్టీ

Congress Strategy for Telangana Assembly Elections 2023 : డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అధికార బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. ప్రచార వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా సర్వేలు, భారత్‌ రాష్ట్ర సమితిపై ఎదురుదాడి, అభ్యర్ధుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టిపెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో.. ఇప్పటివరకు పార్టీ చేసిన కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేందుకు శ్రేణులు సహా అనుబంధ విభాగాల్ని పూర్తిస్థాయిలో మోహరించాలని నిర్ణయించింది.

అందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు.. మధ్యాహ్నం ఇందిరాభవన్‌ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అధ్యక్షతన కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సహా పలువురు ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.

Telangana Assembly Elections 2023 : మరోవైపు దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. హస్తం పార్టీకి జనాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుడటంతో.. పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకర్గంవర్గం మినహా.. రాష్ట్రంలోని మిగిలిన 16 చోట్ల పోటీకి పెద్దసంఖ్యలో ఆశావహులున్నారు. ఈ క్రమంలోనే అశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది.

Congress on Telangana Elections 2023 : అయితే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులను ఎంపికకి కర్ణాటక తరహాలో పారదర్శక విధానం అనుసరించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. దీంతో మూడంచల వడపోత ప్రక్రియను అనుసరించనుంది. ప్రధానంగా మొదటి దశలో నియోజక వర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకుంటారు. పోటీ చేసే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, సునీల్‌ కనుగోలు బృందంతోపాటు పీసీసీ సర్వే నివేదికల ఆధారంగా ప్రజాదరణ కలిగిన నేతలను రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. ఎంపిక చేసి అధిష్ఠానానికి నివేదిస్తుంది.

అనంతరం పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. ఆ తర్వాత సీఈసీ తుది నిర్ణయం తీసుకొని అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తుంది. రేపు హైదరాబాద్‌ రానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. గాంధీభవన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గాల పర్యవేక్షకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇంటింటికి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లడం సహా పార్టీ అధికారంలోకి వస్తే ఏ పనులు చేస్తోందో ప్రజల వద్దకు తీసుకెళ్లేలా కార్యచరణ ఖరారు చేయనున్నారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 40 నుంచి 50 చోట్ల వివాదం లేకుండా ఒక్క అభ్యర్థే పోటీలో ఉన్నట్లు పీసీసీ అంచనావేస్తోంది. అయితే వారిని సర్వేల ఆధారంగా ముందే ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. నెలాఖరున లేదా వచ్చేనెల మొదటి వారంలో.. తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :Aug 4, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.