ETV Bharat / state

ఔటర్​కు బయట, రీజినల్ రింగ్‌రోడ్‌కు లోపల భూములు సేకరించండి : రేవంత్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 9:58 PM IST

CM Revanth Reddy Review on Industries : రాష్ట్రంలో నూతన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు భూములను గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌రోడ్‌కు బయట, రీజినల్ రింగ్‌రోడ్‌కు లోపల 500 నుంచి వెయ్యి ఎకరాల వరకు భూములను గుర్తించాలన్నారు. ఇవికూడా, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు

CM Revanth Reddy on Industries Development
CM Revanth Reddy Review on Industries

CM Revanth Reddy Review on Industries : తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు(Regional Ring Road) లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలన్నారు. అవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని స్పష్టం చేశారు.

యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధిపై ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన(Municipal Administration) శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం తదితరులు హాజరయ్యారు.

CM Revanth Reddy on Industries Development : పరిశ్రమల కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకాని కానివిగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇందువల్ల రైతులకు నష్టం లేకుండా కాలుష్యం తక్కువగా ఉండేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న అభిప్రాయాన్ని రేవంత్‌ రెడ్డి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అవి పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలి : భట్టి విక్రమార్క

పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారన్నారు. ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు(Non-polluting industries) ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు.

CM Revanth Reddy Focus on Industries : బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య, ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవి ప్రజావాస ప్రాంతాలకు(Public Areas) దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని పేర్కొన్నారు.

Industries Development activity in Telangana : పరిశ్రమలకు ధర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి తొలి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈసందర్భంగా బాలానగర్​లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

శీతాకాల విడిదికై రాష్ట్రానికి రాష్ట్రపతి రాక - స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.