ETV Bharat / state

City Top School Chairman Charged For Rape Case : దళిత యువతిపై ప్రైవేటు పాఠశాల ఛైర్మన్​ అత్యాచారం..

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 5:14 PM IST

School Chairman Charged For Rape Case
City Top School Chairman Charged For Rape Case

City Top School Chairman Charged For Rape Case : అతను హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు పాఠశాలకు ఛైర్మన్‌ పేరు మురళీ ముకుంద్​. విద్యార్ధులకు మంచి బుద్దులు చెప్పే స్థానంలో ఉన్నట్లు నటించారు. ఎంతో గౌరవ మర్యాదలున్న వ్యక్తిగా అందరిని నమ్మించారు. కానీ ఇది బయటకు కనిపించే రూపం మాత్రమే.!! ఆయనలో మరో వికృతరూపం ఉంది.. అది ఇప్పుడు బయటపడింది. తన ఇంట్లో పని చేసే యువతిపైనే అత్యాచారం చేసి దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుల మీద తప్పు చేసి ఇప్పుడు కేసుల్లో దొరికిపోయాడు. ఇంట్లో పనిచేసే దళిత యువతిపై అత్యాచారం, దాడి చేసిన ఘటనలో మురళీ ముకుంద్‌తో పాటు అతని కుమారుడు ఆకాష్‌పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు.

City Top School Chairman Charged For Rape Case : హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ... బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌లో నివాసం ఉన్న జూబ్లీహిల్స్‌ ఓ ప్రైవేటు పాఠశాల చైర్మన్‌ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. పనిలో చేరినప్పటి నుంచి ఆ యువతిపై కన్నేశాడు మురళీ ముకుంద్. ఈ ఏడాది జూలై 16న యువతిని బెడ్‌షీట్‌ మడత పెట్టాలని చెప్పి తన బెడ్రూంకు పిలిచాడు ... అనంతరం ఆమెతోపాటు బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టాడు. యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం (Rape On Dalit Woman) చేశాడు. అత్యాచారం జరిగిన విషయం ఎవరికైనా చెబితే యువతితోపాటు ఆమె తల్లిని కూడా చంపేస్తానని బెదిరించాడు.

Young Woman Raped At bus Stand : అమానుషం.. బస్టాండ్​లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం

జులై 17న బాధితురాలు ఈ విషయాన్ని మురళీముకుంద్‌ కుమారుడు ఆకాష్‌కు చెప్పింది. అయితే తన తండ్రి చేసిన అకృత్యానికి అతడూ వంత పాడాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ బాధితురాలిని తీవ్రంగా కొట్టాడు. యువతిని చంపేస్తానంటూ బెదిరించాడు. రెండు రోజుల తర్వాత బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఆ యువతిపై తప్పుడు ఫిర్యాదు చేసింది మురళీ కుటుంబం. సిమ్​కార్డు దొంగలించిందంటూ కేసు పెట్టారు.

Private School Chairman Booked For Rape Case Hyderabad : కానీ బాధితురాలి తల్లికి మాత్రం.. డబ్బులు, బంగారం దొంగలించిందంటూ.. ఫోన్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. సిమ్‌కార్డు చోరీ కేసుతో భయపడిన బాధితురాలు.. అత్యాచారం, దాడి విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు భయపడింది. మరోవైపు అత్యాచార ఘటన చెప్పకుండా ఉండేందుకు బాధితురాలితో మధ్యవర్తిత్వం కుదుర్చుకొని రూ.లక్షా 70వేలు ఇచ్చారు. ఈ డబ్బుతో బాధితురాలి నోరు మూయించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా.. సిమ్‌ దొంగలించినట్లు బాధితురాలిపై ఆరోపణలు చేసి ఫోన్‌లో తానే సిన్​ను దొంగలించినట్లు వాయిస్‌ రికార్డు చేయించుకున్నారు.

Woman Murder in Nanakramguda : నానక్‌రాంగూడలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! గవర్నర్, మహిళా కమిషన్ స్పందన

సిమ్​కార్డు చోరీ కేసుతో భయపడిపోయిన బాధితురాలు ఇంటికే పరిమితమైంది. ఆమె భయాందోళనకు గురకావడం, ఇంటికే పరిమితం కావడంతో తల్లి ఆరా తీసింది. దీంతో.. అసలు విషయం చెప్పింది బాధితురాలు. మురళీ ముకుంద్‌ వికృత రూపాన్ని బయటపెట్టింది. అతని కుమారుడు ఆకాష్‌ ప్రవర్తించిన తీరును తల్లితో వివరించింది. దీంతో తన కుమార్తెతో కలిసి ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు మురళీముకుంద్‌పై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. మురళీ ముకుంద్​తో పాటు ఆయన కుమారుడు ఆకాష్‌పై కేసు నమోదు చేసి.. పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Live Video : అర్ధరాత్రి తలుపుకొట్టి అత్యాచారయత్నం.. ఆ మహిళ ఏం చేసిందో చూస్తే..!

థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. భగ్గుమన్న విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.