ETV Bharat / crime

థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. భగ్గుమన్న విద్యార్థులు

author img

By

Published : Dec 3, 2022, 12:17 PM IST

Updated : Dec 3, 2022, 7:09 PM IST

HCU Professor Attempted To Rape Thailand Student : హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరోసారి అత్యాచార ఆరోపణలు కలకలం సృష్టించాయి. హిందీ నేర్పిస్తానని థాయ్‌లాండ్ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లిన ప్రొఫెసర్ ఆమెతో మద్యం తాగించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న యువతి వర్సిటీ అధికారులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, వర్సిటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు వర్సిటీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ధర్నాతో దిగొచ్చిన వర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది.

hcu  Professor attempted to rape Thailand student
hcu Professor attempted to rape Thailand student

థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం

HCU Professor Attempted To Rape Thailand Student : హైదరాబాద్‌ నగరంలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకొని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌పై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.

హెచ్‌సీయూ విద్యార్థుల ధర్నా

అసలేం జరిగిందంటే.. "హిందీ నేర్చుకునేందుకు థాయిలాండ్ నుంచి హెచ్‌సీయూకు విద్యార్థిని వచ్చింది. హిందీ పుస్తకం ఇస్తానని ఆమెను ప్రొఫెసర్‌ రవిరంజన్‌ తన ఇంటికి తీసుకెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థినిని తన ఇంటికి తీసుకెళ్లాడు ప్రొఫెసర్. ఇంటికి తీసుకువెళ్లి కూల్‌డ్రింక్‌లో లిక్కర్ కలిపి ఇచ్చాడు. మద్యం తాగించి అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించాడు. ఎలాగోలా ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని వర్సిటీ అధికారులకు కాల్ చేసింది. రవిరంజన్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అధికారులకు ఫోన్‌లో చెప్పింది. వెంటనే స్పందించిన అధికారులు రవిరంజన్‌కు కాల్ చేసి వెంటనే ఆ విద్యార్థినిని వర్సిటీలో దింపాలని చెప్పారు. ప్రొఫెసర్ రవిరంజన్ శుక్రవారం రాత్రి 9 గంటలకు వర్సిటీ గేటు వద్ద బాధితురాలిని వదిలిపెట్టాడు. అమ్మాయిని తీసుకువెళ్లినప్పుడు ప్రొఫెసర్ ఇంట్లో ఎవరూ లేరు. బాధితురాలు, యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రొఫెసర్‌పై ఐపీసీ 354, 354 ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిందితుడు రవిరంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం." అని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు.

ఇంతకుముందు కూడా ఇలాగే చేశాడు.. గతంలోనూ రవింరంజన్‌ విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయని వర్సిటీ విద్యార్థినులు తెలిపారు. అప్పట్లో నమోదైన కేసుల్లో చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం ఉమెన్‌ఎంపవర్‌మెంట్‌పై ప్రొఫెసర్ రవిరంజన్ ఉపన్యాసం ఇచ్చాడు. ఈ తరుణంలో అత్యాచార ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది.

భగ్గుమన్న విద్యార్థీలోకం

భగ్గుమన్న విద్యార్థీలోకం.. వర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు భగ్గుమన్నారు. దుశ్చర్యకు పాల్పడిన ప్రొఫెసర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ గేటు ఎదుట ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆచార్యులే దారుణాలకు పాల్పడితే ఇంకెవరికి చెప్పాలంటూ పలువురు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు.

HCU Professor Attempted To Rape Thailand Student
ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెన్షన్ లెటర్

ప్రొఫెసర్ సస్పెండ్.. విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు చర్యలు చేపట్టారు. హిందీ ప్రొఫెసర్ రవిరంజన్‌ను సస్పెండ్‌ చేశారు. విద్యార్థిని అత్యాచార ఆరోపణల నేపథ్యంలో చర్యలు చేపట్టినట్లు తెలిపిన అధికారులు..అతడిని విధుల్లో నుంచి తొలగించినట్లు వివరించారు. ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో వీసీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 3, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.