ETV Bharat / state

ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం పడకూడదు - ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి : భట్టి విక్రమార్క

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 9:37 PM IST

Bhatti Vikramarka Review Meeting on TSRTC : టీఎస్​ఆర్టీసీకి ప్రతి నెలా మహాలక్ష్మి నిధులను ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఛార్జీలు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Bhatti Instructions on TSRTC Officials
Bhatti Vikramarka Review Meeting on TSRTC

Bhatti Vikramarka Review Meeting on TSRTC : ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం పడకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులకు సూచించారు. సచివాలయంలో టీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

త్వరలో టీఎస్​ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్​ బస్సులు

Mahalakshmi Scheme Result in Telangana : మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళల ప్రయాణాలు సాగాయని, ఇది గొప్ప విషయమని భట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్​ను అందరికి సరైన విధంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీఎస్​ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

Minister Ponnam Prabhakar Review Meeting on TSRTC : ఆర్టీసీ సంస్థ(TSRTC Review Meeting) సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్​మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీ - రేపు కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభం

"ఆర్టీసీకి ప్రతి నెలా మహాలక్ష్మి నిధులు ఇస్తాం. ఆర్టీసీపై భారం పడకుండా చూస్తాం. ఛార్జీలు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలి. బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్​మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం."- భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

Bhatti Instructions on TSRTC Officials : ఆర్టీసీ ప్రజల సంస్థ అని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)పేర్కొన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనూహ్య స్పందన - వారం రోజుల్లోనే 11 లక్షల మంది ఉచిత ప్రయాణం

పురుషుల కోసం టీఎస్​ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.