ETV Bharat / state

మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనూహ్య స్పందన - వారం రోజుల్లోనే 11 లక్షల మంది ఉచిత ప్రయాణం

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 10:44 AM IST

Huge Response To Mahalakshmi Scheme in Joint Warangal District : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనూహ్యస్పందన లభిస్తోంది. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో, మహిళలు పుణ్యక్షేత్రాలకు, పర్యటనలకు మొగ్గు చూపుతున్నారు. వారం రోజుల్లో వరంగల్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలోని బస్సులలో 11 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.

Mahalakshmi Scheme in Telangana
Mahalakshmi Scheme in Telangana

మహాలక్ష్మి పథకానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనూహ్య స్పందన

Huge Response To Mahalakshmi Scheme in Joint Warangal District : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని తొమ్మిది డిపోలలోని బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వారాంతాల్లో అయితే ఈ రద్దీ మరింతగా ఉంటోంది. హనుమకొండ నుంచి వేములవాడ, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు కూడా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత వారం రోజులుగా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలకు, ఇప్పుడు కండక్టర్లు జీరో టికెట్లు (TSRTC Zero Tickets) ఇస్తున్నారు.

TSRTC Zero Tickets for Women : టికె‌ట్లపై ఛార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో అందులో నమోదవుతుంది. ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పటివరకు 11 లక్షల మంది మహిళలు ప్రయాణించారని, జాతరలకు వెళ్లే భక్తులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.

ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం

"మొత్తం 100 శాతంలో 60 శాతం మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. జీరో టికెట్ అంటే వారు ఎంత చెల్లించాలనేది దానిలో ఉంటుంది. వాటన్నింటిని మేము ప్రభుత్వానికి అందిస్తాం. ఆ విధంగా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. జాతరలకు వెళ్లే భక్తులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది." - శ్రీలత, వరంగల్ రీజినల్ మేనేజర్

TSRTC Free Bus Service Women in Telangana : నూతన ప్రభుత్వం కొలువు తీరగానే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana)ఎంతో ప్రయోజనకరమని మహిళలు అంటున్నారు. తమ లాంటి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కళాశాలలకు వెళ్లేందుకు బస్‌పాస్ కోసం ఆన్‌లైన్‌ సెంటర్‌లో అప్లికేషన్ పెట్టుకొని, రోజుల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు ఇబ్బంది లేకుండా పోయిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

"ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. మా లాంటి మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఉచితప్రయాణం కల్పించడం సంతోషం. ఎక్కడికైనా జీరో టికెట్ ఇస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలియజేేస్తున్నాం. అలాగే రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం." - మహిళలు

Mahalakshmi Scheme in Telangana : శనివారం హనుమకొండ, వరంగల్ ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణీకులతో కిటకిటలాడాయి. బస్సుల కోసం మహిళలు ఎదురు చూస్తూ తమ గమ్యస్ధానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు నుంచి రద్దీ పెరిగిందని అందుకు తగినట్లుగా మరిన్ని ఆర్టీసీ బస్సులను ప్రవేశ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కిక్కిరిసిన నిర్మల్​ బస్టాండ్​ - సీటు కోసం డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు

ఉచిత ప్రయాణం ఆనందం అంటున్న మహిళలు - నష్టపోతున్నామంటూ ఆటోడ్రైవర్ల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.