ETV Bharat / state

పౌరవిమానయాన చరిత్రలో ఈరోజు నిలిచిపోతుంది : సింధియా

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 3:26 PM IST

Updated : Jan 18, 2024, 7:02 PM IST

Begumpet Wings India Aviationa Event 2024 : హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్‌ ఇండియా- 2024 ప్రదర్శనను జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. పౌర విమానయానశాఖ ఆధ్వర్వంలో ఈ వైమానిక ప్రదర్శన జరగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్లు, హైవేల శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 4 రోజులపాటు జరగనున్న ఇందులో భారీ విమానాలు, ఛార్టెడ్‌ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను ప్రదర్శించనున్నారు.

Minister Scindia on Wings India 2024
Begumpet Wings India Aviationa Event 2024

Begumpet Wings India Aviationa Event 2024 : పౌర విమానరంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లు పెరిగిందని ఆయన తెలిపారు. దానికి తగ్గ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా- 2024 వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Aviation Show: సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​..

2047 సంవత్సరం నాటికి విమానరంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాగించే దిశగా ముందుకు వెళుతున్నామని, గత పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని తెలిపారు. ముంబయి, దిల్లీలో గ్రీన్​ఫీల్డ్​ ఎయిర్​పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చారని, అలాంటి మరిన్ని నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్​లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నామని అన్నారు. కశ్మీర్ అభివృద్ధికి ఇది మరింత దోహదం చేస్తుందని చెప్పారు. డ్రోన్​లకు డిమాండ్ పెరగడంతో, మహిళ పైలట్లను తీర్చిదిద్దుతున్నామని, ఉడాన్​ 5.3ను ఈరోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇవాళ భారత్‌లో 57 ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌టీఓ) ఉన్నాయి. ఎఫ్‌టీఓల్లో వృద్ధితోపాటు భారీ సంఖ్యలో కమర్షియల్‌ పైలట్‌ లెసెన్స్‌లు కూడా ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే... అందులో 18శాతం మహిళా పైలెట్లే ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో 10వేల మంది మహిళలకు డ్రోన్‌లపై శిక్షణ ఇస్తామని వివరించారు.

Begumpet Wings India Aviationa Event 2024 పౌరవిమానయాన చరిత్రలో ఈరోజు నిలిచిపోతుంది సింధియా

Minister Scindia on Wings India 2024 : ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. పౌర విమానయాన చరిత్రలో ఈరోజు నిలిచిపోతుందన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్​క్రాఫ్ట్​లను కొనుగోలు చేస్తోందని, ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో దూసుకుపోతున్నామని చెప్పారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించారలని మోదీ సంకల్పించారని ఆ దిశగా ముందుకెళ్తున్నామని ఆకాశమే మన హద్దు అని సింధియా అన్నారు.

"హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ప్రదర్శన సంతోషకరం. రాష్ట్రంలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉంది. ఏరో స్పేస్ పెట్టుబడులకు. హైదరాబాద్ ఎంతో అనుకూలండ్రోన్ పైలెట్లకు ఎక్కువగా శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయం, అత్యవసరాలు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి

ఈనెల 18 నుంచి వింగ్స్ ఇండియా 2024 - బేగంపేట ఎయిర్‌పోర్టుకు బోయింగ్ 777-9 విమానం

ప్రదర్శనలో ఇవాళ్టి నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.15 నుంచి 5వరకు జరుగుతాయి. 19న ఉదయం 11 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15నిమిషాల నుంచి 5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను లోనికి అనుమతించనున్నారు. టికెట్‌ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఫ్రీ. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

విచ్చేసిన లేటెస్ట్ విమానాలు.. ఘనంగా వింగ్స్ ఇండియా ఏవియేషన్‌ షో ప్రారంభం..

Last Updated :Jan 18, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.