ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​కు స్టార్ ప్లేయర్ జకోవిచ్ కష్టమే!

author img

By

Published : Jun 10, 2020, 11:39 AM IST

యూఎస్​ ఓపెన్​కు స్టార్ ప్లేయర్ జకోవిచ్ దూరం!
స్టార్ ప్లేయర్ జకోవిచ్

అగ్రరాజ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యూఎస్​ ఓపెన్​లో పాల్గొనకూడదని ప్రముఖ ఆటగాడు జకోవిచ్ భావిస్తున్నాడు.

టాప్​సీడ్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్.. ప్రతిష్టాత్మక యూఎస్​ ఓపెన్​కు దూరం కానున్నాడు. తాజాగా ఓ ఛానెల్​తో మాట్లాడిన జకో, అమెరికాలో కేసులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒకవేళ ప్రేక్షకులు లేకుండా టోర్నీ జరిగినా ఆడే ఆలోచన లేదని భావిస్తున్నాడు.

"ప్రస్తుతం అమెరికాలో తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. టోర్నీ జరుగుతుందని అనుకోవడం లేదు. నేను మాట్లాడిన వారిలో చాలామంది ప్లేయర్లు అక్కడికి(న్యూయార్క్) వెళ్లేందుకు ఇష్టంగా లేరు. అయితే సెప్టెంబరుకు వాయిదా పడ్డ ఫ్రెంచ్ ఓపెన్​ జరగొచ్చనిపిస్తోంది" -జకోవిచ్, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు

Djokovic
టాప్​సీడ్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31న యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రాణంతక కరోనా కారణంగా ఇప్పటికే వింబుల్డన్ రద్దవగా, గత వారం ముగియాల్సిన ఫ్రెంచ్ ఓపెన్.. సెప్టెంబరుకు వాయిదా పడింది. అయితే రోజురోజుకు పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో ఇది జరుగుతుందా? లేదా? అనేది సందేహమే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.