ETV Bharat / sports

'నాపై ఎవరు వివక్ష చూపారో అది వారికి తెలుసు'

author img

By

Published : Jun 9, 2020, 3:07 PM IST

Updated : Jun 9, 2020, 4:25 PM IST

ఐపీఎల్​లో తనపై వర్ణవివక్ష చూపారంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్​ మాజీ కెప్టెన్​ డారెన్​ సామి తాజాగా భావోద్వేగంతో కూడిన ఓ వీడియో సందేశాన్ని ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. తనపై ఎవరైతే వివక్ష చూపారో.. ఆ విషయం వారికి కూడా తెలుసని అన్నాడు.

సామి
సామి

ఐపీఎల్​లో తనపై జాతివివక్ష చూపిస్తూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన వెస్టిండీస్​ మాజీ కెప్టెన్​ డారెన్​ సామి.. తాజాగా తన ఇన్​స్టాలో భావోద్వేగంతో కూడిన ఓ వీడియో సందేశాన్ని పోస్ట్​ చేశాడు. ఎవరైతే తనపై వివక్ష చూపారో.. ఆ విషయం వారికి కూడా తెలుసని అన్నాడు. వారు ఎందుకు అలా చేసేవారో ఓసారి ఆత్మపరీక్ష చేసుకోవాలన్నాడు.

"ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్​ జట్లతో ఆడాను. నేను ఆడిన ప్రతిచోటా డ్రెసింగ్​రూమ్​లో ప్రతిఒక్కరినీ సమానంగా చూసేవాడిని. అలాగే తమ సంస్కృతిలో కొంతమంది ప్రజలు నల్లజాతీయులను ఎలా స్వీకరిస్తారు? ఏ పదంతో పిలుస్తూ వారిని ఎగతాళి చేసేవారో ఇండియన్ అమెరికన్​ దర్శకనటుడుస, కమెడియన్ హసన్​ మిన్హాజ్ షో ​ ద్వారా తెలుసుకున్నాను. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఆడేటప్పుడు కొంతమంది 'కాలు' పదంతో నన్ను పిలిచేవారు. ఆ సమయంలో ఆ పదం అర్థం తెలీదు. కానీ నా సహచరులు మాత్రం నవ్వుకునేవారు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. సరదాగా తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైతే నన్ను హేళనగా చూస్తూ వెక్కిరిస్తూ పిలిచారో.. ఆ విషయం వారికి కూడా తెలుసు. అలా నన్ను ఎందుకు అనేవారో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు ఇంకా బాగానే గుర్తుంది.. ఎవరెవరు 'కాలు' అనే పదంతో పిలిచేవారో. మనం కూర్చుని ఈ విషయంపై పరస్పరంగా మాట్లాడుకుందాం."

-డారెన్​ సామి, వెస్టిండీస్​​ మాజీ కెప్టెన్​

అయితే డారెన్​ సామి ఆరోపణలను బీసీసీఐ ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని వెల్లడించింది. అతడి మాజీ సహచరులు పార్థివ్‌ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, వేణుగోపాల్​ రావు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

ఇది చూడండి : 'ఐపీఎల్​లో నాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు'

ఇది చూడండి : 'దక్షిణాది క్రికెటర్లూ వివక్షను ఎదుర్కొన్నారు'

Last Updated :Jun 9, 2020, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.