ETV Bharat / sports

హాలీవుడ్ రేంజ్​లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్​లోనే హెలికాప్టర్ ల్యాండింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 5:43 PM IST

Updated : Jan 11, 2024, 6:08 PM IST

Warner Helicoptor Entry: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం బిగ్​బాష్ లీగ్​లో ఆడుతున్నాడు. అయితే జనవరి 12న జరగనున్న మ్యాచ్​కు వార్నర్ హెలికాప్టర్​లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Warner Helicoptor Entry
Warner Helicoptor Entry

Warner Helicoptor Entry: ఇంటర్నేషనల్ వన్డే, టెస్టు ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టీ20ల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్​బాష్ టీ20 లీగ్​లో ఆడుతున్నాడు. ఈ లీగ్​లో వార్నర్ సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్​లో భాగంగా జనవరి 12 శుక్రవారం సిడ్నీ సిక్సర్స్- సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదిక కానుంది.

అయితే ప్రస్తుతం హంటర్ వ్యాలీ (Hunter Valley) ప్రాంతంలో సోదరుడి పెళ్లి వేడుకలో ఉన్న వార్నర్, మ్యాచ్ సమయానికి ముందు హెలికాప్టర్​లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​కు దగ్గరలో ఉన్న అలియన్స్​ ఫుట్​బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ల్యాండ్ అవ్వనున్నాడు. దీంతో వార్నర్​ హాలీవుడ్ హీరో అంటూ అతడి టీమ్​మేట్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 'వార్నర్ హాలీవుడ్ హీరో. రేపు వార్నర్ ల్యాండ్ అయ్యే సమయానికి నేను గేట్ బయట అతడి కోసం ఎదురుచూస్తా. వార్నర్​ను బిగ్​బాష్​లో చూడాలని ఆశించే ఫ్యాన్స్​లో నేనూ ఒకడిని. వరల్డ్​లోనే అత్యుత్తమ క్రికెటర్లలో వార్నర్ ఒకడు' అని ఆసీస్ ప్లేయర్ సీన్ అబాట్ అన్నాడు.

David Warner Bigbash League: బిగ్​బాష్​ లీగ్​లో వార్నర్ గతేడాది సిడ్నీ థండర్స్ రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్​తో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అవనుంది. అయితే డొమెస్టిక్ లీగ్​ల్లో ఆడతానంటూ వార్నర్ ఇటీవల పేర్కొనడం వల్ల వచ్చే సీజన్​లోనూ అతడిని చూడవచ్చు.

Sydney Thunder 2024: ప్రస్తుత లీగ్​లో సిడ్నీ థండర్స్ ఘోరంగా విఫలమౌతోంది. ఇప్పుటిదాకా 7 మ్యాచ్​లు ఆడిన థండర్స్ కేవలం ఒక మ్యాచ్​లోనే నెగ్గి ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్​లో ఫలితం తేలలేదు. దీంతో వార్నర్ రాకతో జట్టు ప్రదర్శన మారవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 9 మ్యాచ్​ల్లో 7 విజయాల (16 పాయింట్లు)తో బ్రిస్బేన్ హీట్ పాయింట్ల పట్టికలో టాప్​ పొజిషన్​లో ఉండగా, 8 మ్యాచ్​ల్లో 6 ఓటములు ముటగట్టుకున్న మెల్​బోర్న్​ రెనెగేడ్స్​ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పీఎస్​ఎల్​ విజేతగా లాహోర్​.. కెప్టెన్​గా షహీన్​ అఫ్రిది రికార్డు

Maxwell Record: మ్యాక్స్​వెల్​ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ

Last Updated :Jan 11, 2024, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.