ETV Bharat / sports

ఒక్క మ్యాచ్​తో మూడు రికార్డులు, వారి ఆశలన్నీ కింగ్ కోహ్లీపైనే

author img

By

Published : Aug 26, 2022, 6:59 PM IST

Virat Kohli Records In T20 క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్​లో భారత స్టార్​ బ్యాటర్ విరాట్ కోహ్లీ ​ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.

virat kohli records in t20
virat kohli records in t20

Virat Kohli Records In T20: ఆసియా కప్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. యూఏఈ వేదికగా శనివారం టోర్నీ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌ శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మధ్య జరగనుండగా.. క్రికెట్‌ అభిమానుల దృష్టి మొత్తం మరుసటి రోజు జరగబోయే భారత్‌, పాకిస్థాన్‌ పోరు పైనే ఉంది. ఈ దాయాది దేశాల మధ్య పోరుతోపాటు.. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రదర్శన చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకోబోతున్నాడు. ఈ మ్యాచ్‌ ఆడితే.. 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్రలో నిలవనున్నాడు. ఇదివరకు ఈ ఫీట్‌ను న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ మాత్రమే సాధించాడు.

ఇంగ్లాండ్ టూర్‌లో కోహ్లీ తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆపై వెస్టిండీస్‌, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లకు సీనియర్లకు విశ్రాంతినివ్వడం వల్ల కోహ్లీ ఆడలేదు. గతంలో జరిగిన ఆసియా కప్పుల్లో ఈ పరుగుల యంత్రం 60 సగటుతో రాణించడం భారత్‌కు సానుకూలాంశం. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్‌.. తిరిగి ఫామ్‌ సాధించి ఈ టోర్నీలో చెలరేగిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

  • విరాట్‌ ఇప్పటివరకు 99 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. రాబోయే మ్యాచ్‌ ద్వారా అతడు 100 పూర్తిచేసుకొని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు ఆడిన రెండో వ్యక్తిగా నిలువనున్నాడు. అతడికంటే ముందు ఈ జాబితాలో రాస్‌ టేలర్‌ మాత్రమే ఉన్నాడు.
  • కోహ్లీ మరో ఏడు సిక్సులు కొడితే.. టీ20ల్లో రోహిత్‌ తర్వాత 100 సిక్సులు బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.
  • ఈ ఫార్మాట్‌లో ఇంకో 374 పరుగులు చేస్తే.. 11వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా విరాట్‌ చరిత్రలో నిలిచిపోనున్నాడు.

ఇవీ చదవండి: ధోనీపై కోహ్లీ ట్వీట్​, ఆ నెంబర్స్​ వెనక అర్థం ఏమిటో

Asia Cup​ ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించిందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.