ETV Bharat / sports

T20 Worldcup: భారత్​-పాక్ మళ్లీ ఎప్పుడు తలపడనున్నాయంటే?

author img

By

Published : Oct 25, 2022, 12:06 PM IST

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది టీమ్​ఇండియా. దీంతో భారత జట్టు జోష్​ మీదుండగా.. పాక్ జట్టు కసితో ఉంది. అయితే ఈ రెండు తలపడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. మరి ఈ రెండు జట్లు మళ్లీ ఈ ప్రపంచకప్​లో ఎప్పుడు తలపడతాయంటే?

Teamindia pak match
భారత్​-పాక్ మళ్లీ ఎప్పుడు తలపడనున్నాయంటే?

టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని సాధించి టీమ్​ఇండియా శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో మనోళ్లు 4 వికెట్ల తేడాతో గెలిచారు. అయితే ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్లు మళ్లీ తలపడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అందుకు అవకాశాలున్నాయా? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అన్నీ కుదిరితే ఈ దాయాది జట్టు మళ్లీ ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈ ఇరు జట్లు గ్రూప్‌ మ్యాచ్‌ల్లో టేబుల్‌ పట్టికలో టాప్‌లో ఉండాలి. ఆపై సెమీఫైనల్లోనూ ప్రత్యర్థులను ఓడిస్తే ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీ పడే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం సూపర్‌-12 దశలో మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. గ్రూప్‌-బిలో ఉన్న భారత్, పాక్‌.. అందులోని దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించాల్సి ఉంటుంది. 3-4 మ్యాచ్‌లు గెలిచి మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆపై గ్రూప్‌-ఎ నుంచి వచ్చిన జట్లతో పోటీ పడతాయి. ఆ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ లాంటి బలమైన టీమ్‌లు ఉన్నాయి. వీటిల్లో నుంచి సెమీస్‌కు వచ్చిన రెండు జట్లను భారత్, పాక్‌ ఓడిస్తే.. ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్లో తలపడతాయి.

ఇదీ చూడండి: T20 Worldcup: విండీస్​​ హెడ్​కోచ్​ రాజీనామా.. కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.