ETV Bharat / sports

'వాళ్లతో ఆడినప్పుడే అసలు సత్తా తెలుస్తుంది'.. టీమ్ఇండియాపై గావస్కర్​ ఫైర్

author img

By

Published : Aug 16, 2023, 11:07 AM IST

sunil gavaskar about team india
sunil gavaskar about team india

Sunil Gavaskar About Team India : ఇటీవలే వెస్టిండీస్ టూర్​లో భాగంగా జరిగిన టీమ్ఇండియా జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో అభిమానులతో పాటు మాజీలు భారత జట్టుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా టీమ్ఇండియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..

Sunil Gavaskar About Team India : రానున్న కొద్ది రోజుల్లో కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్​ టోర్నీలు జరగనున్నాయి. ఇక దీనికి ముందే వెస్టిండీస్ చేతిలో టీమ్​ఇండియా టీ20 సిరీస్ ఓటమిపాలైన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్​లకు కనీసం అర్హత సాధించని కరేబియన్​ జట్టు పై కూడా గెలవలేని పరిస్థితుల్లో మన జట్టు ఉందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్​ మాజీలు సైతం రోహిత్​ సేనపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా టీమ్ఇండియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

"ఓ ప్లేయర్ ఫ్రాంఛైజీ స్థాయిలో బాగానే ఆడుచ్చు. కానీ దేశానికి ప్రాతినిథ్యం వహించినప్పుడు మాత్రం తన ఆటతీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లపై ఉండే ఒత్తిళ్లు, అంచనాలు వేరే లెవల్​లో ఉంటాయి. ఈ స్థాయిలో ఫ్రాంఛైజీ క్రికెట్​లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన ఆటగాళ్లు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. అండర్ 19లో ఇరగదీసిన యువ ఆటగాళ్లు పురుషుల క్రికెట్​లో విఫలమవ్వడం మనం ఎన్నిసార్లు చూడలేదు" అంటూ ఓ స్పోర్ట్స్​ మ్యాగజైన్​కు రాసిన కాలమ్​లో గావస్కర్ పేర్కొన్నాడు. అయితే సునీల్​ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడన్న విషయంపై క్లారిటీ లేదు.

"పిల్లలు పిల్లలతో ఆడినప్పుడు బాగానే అనిపిస్తారు. కానీ మగాళ్లతో ఆడినప్పుడే తడబడతారు. అండర్ 19 క్రికెట్​లో ఓ కేకులా అనిపించింది కూడా ఇక్కడ చూస్తే బురదలా అనిపిస్తుంది. అందుకే కుర్రాళ్లు క్రికెట్​లో రాణించిన ఎంతో మంది ప్లేయర్లు పురుషుల క్రికెట్​లో విఫలమయ్యారు. ఇక ఫ్రాంఛైజీ లెవల్​లో అవసరమైన స్కిల్స్​ చాలా తక్కువగానే ఉంటుంది. కోట్లు పెట్టి ఫ్రాంఛైజీలు తమను కొనుగోలు చేసి ఈ యువకులు ఎలాగైనా రాణించాలన్న కసి కోల్పోతారు. ఆ తర్వాత తమ ఆట పతనమైనా అవే ఫ్రాంఛైజీలకు తక్కువ మొత్తాలకు కూడా కాంట్రాక్ట్ పై సంతకాలు చేస్తారు" అని గావస్కర్ అన్నాడు.

Sunil Gavaskar On Rohit Sharma : ఇక సునీల్​ గావస్కర్ తాజాగా టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మపై సంచలన వ్యాఖ్యాలు చేశాడు. రోహిత్‌ కెప్టెన్సీ తనను నిరాశపరిచిందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లీ కెప్టెన్సీలో దక్కని ఐసీసీ ట్రోఫీలు.. రోహిత్‌ హయాంలోనైనా వస్తాయంటూ ఆశించానని పేర్కొన్న గావస్కర్.. రెండుసార్లు అవకాశం వచ్చినా రోహిత్ మాత్రం ట్రోఫీని జట్టుకు అందించలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో వందల మ్యాచులకు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. టీ-20 టోర్నీలో జట్టును ఫైనల్‌ వరకు చేర్చలేకపోవడం పట్ల నిరాశ చెందినట్లు గవస్కర్‌ తెలిపాడు.

రోహిత్​ విశ్రాంతి తీస్కో.. ఎందుకలా కష్టపడుతున్నావ్​

'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ను పక్కనబెట్టారా?'.. గావస్కర్‌ అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.