ETV Bharat / sports

10ఏళ్ల కోసం గంభీర్‌కు షారుక్​ బ్లాంక్ ‌చెక్‌! బీసీసీఐ అధికారులతో గౌతమ్ భేటీ? చివరకు ఏమవుతుందో? - Gautam Gambhir

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 3:39 PM IST

Shahrukh Offer To Gambhir : టీమ్‌ ఇండియా కోచ్‌గా గంభీర్‌ పేరు బలంగా వినిపిస్తోంది. కానీ అతడు కేకేఆర్‌ మెంటార్‌గా ఉండటానికి షారుఖ్‌ ఖాన్‌ ఇచ్చి బిగ్‌ ఆఫర్‌ను వదులుకుంటాడా? హెడ్ కోచ్ పోస్ట్​కు మరి అప్లై చేయనట్టేనా?

shahrukh offer to gambhir
shahrukh offer to gambhir (Source : Getty Images)

Shahrukh Offer To Gambhir : టీమ్​ఇండియా హెడ్‌ కోచ్‌ పదవి అప్లికేషన్‌ గడువు మే 27తో ముగియనుంది. ఆస్ట్రేలియా దిగ్గజాలు రికీ పాంటింగ్‌, జస్టిన్‌ లాంగర్‌, సీఎస్కే కోచ్‌ స్టీఫన్‌ ఫ్లెమింగ్‌, ఎన్‌సీఏ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఇండియా కోచ్‌ పదవిపై ఆసక్తి లేదన్న విషయం తెలిసిందే. ఇవి పక్కన పెడితే తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా, విదేశీ కోచ్‌లపై ఆసక్తి లేదని భారత క్రికెట్‌ గురించి పూర్తిగా తెలిసిన ఇండియన్‌ కోచ్‌ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు. పాంటింగ్‌, లాంగర్‌ను సంప్రదించినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఈ క్రమంలో కోచ్‌గా ఉండటంపై ఆసక్తి చూపుతున్న గంభీర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మెంటార్‌గా అద్భుతమైన రికార్డు
అయితే గంభీర్ ఐపీఎల్ చరిత్రలో టీమ్ మెంటార్‌గా అద్భుతమైన రికార్డు సాధించాడు. 2022లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు పని చేశాడు. అప్పుడు లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. బ్యాక్-టు-బ్యాక్ సీజన్స్‌లో లీగ్‌ స్టేజ్‌లో మూడో స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌ గంభీర్‌ని మెంటార్‌గా తీసుకొంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ పాయింట్స్‌ టేబుల్లో టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. అలానే ఫైనల్‌కు చేరింది.

బీసీసీఐ ఉన్నతాధికారులకు కలవనున్న గంభీర్‌!
ఓ మీడియా నివేదిక ప్రకారం, టీమ్​ఇండియా కోచ్‌ పదవికి అప్లై చేసుకోవాలని గంభీర్‌ను బీసీసీఐ సంప్రదించింది. అలానే చెన్నైలో KKR vs SRH ఐపీఎల్‌ ఫైనల్‌ మధ్య గంభీర్‌, కొంతమంది BCCI ఉన్నతాధికారులకు కలిసే అవకాశం ఉంది. గంభీర్ ఇంకా కోచ్‌ పదవికి అప్లికేషన్‌ సబ్మిట్ చేయలేదు. చేస్తే అతడికే పదవికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే అంతకుముందు గంభీర్‌, కేకేఆర్‌ కో-ఓనర్‌ షారుక్ ఖాన్‌తో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. గంభీర్‌ను 10 సంవత్సరాల పాటు టీమ్‌ను మేనేజ్‌ చేయమని షారుక్ కోరాడట. అంతే కాదు ఎంతైనా చెల్లించేందుకు షారుక్ సిద్ధపడ్డాడట. గంభీర్‌కు బ్లాంక్ చెక్ కూడా అందజేశాడట. ఈ విషయంపై స్పష్టత కోసం గంభీర్‌ను సంప్రదించడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించాయి. కానీ అతడి నుంచి ఇంకా స్పందన రాలేదని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.