ETV Bharat / sports

వన్డేలో యంగ్​ ప్లేయర్​ సంచలనం.. 400 ప్లస్​ రన్స్​.. రోహిత్ రికార్డ్​ బ్రేక్​

author img

By

Published : Nov 14, 2022, 12:05 PM IST

50 ఓవర్ల ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని శివమొగ్గాలో జరిగిన అంతర్‌ జిల్లా అండర్‌-16 టోర్నీ.. ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్‌ సెంచరీ (నాలుగు వందల పరుగులు) బాదాడు. ఆ వివరాలు..

Etv Bharat
తన్మయ్ ముంజునాథ్​ రోహిత్ రికార్డ్ బద్దలు

టీ20ల్లో సెంచరీ.. వన్డేల్లో డబుల్‌ సెంచరీ.. టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ.. ఇప్పటి వరకు మనం చూసిన అద్భుతాలు. కానీ వన్డే క్రికెట్‌లో ఏకంగా 400 స్కోరు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడదే ఊహించని ఫీట్‌ నమోదైంది. వన్డేల్లో ఏకంగా 407 పరుగులు సాధించాడో కుర్రాడు. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. సిక్సర్ల సునామీతో ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 165 బంతుల్లోనే ఏకంగా 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి.. వన్డే మ్యాచ్‌లో అద్భుతం సృష్టించాడు.

కర్ణాటకలో జరిగిన అంతర్‌ జిల్లా పోటీల్లో ఈ మహా విధ్వంస చోటు చేసుకుంది. ఆదివారం సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌-భద్రావతి ఎన్టీసీసీ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో తన్మయ్‌ మంజునాథ్‌ అనే అండర్‌-16 క్రికెటర్‌ ఈ చరిత్ర సృష్టించాడు. సాగర్‌ క్రికెట్‌ క్లబ్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. భద్రావతి బౌలర్లను బెంబేలెత్తించాడు. బంతిని బాదితే ఫోర్​ లేదా సిక్స్​ అంటూ ఎవరూ ఊహించలేని రికార్డును నమోదు చేశాడు. కాగా, మంజునాథ్‌ కర్ణాటకలోని శిమమొగ్గా ప్రాంతానికి చెందిన వాడు. సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌ 16 పోటీల్లో పాల్గొన్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో మంజునాథ్‌ పేరు సంచలనంగా మారింది.

సరిగ్గా అదే రోజు.. 2014లో రోహిత్‌ శర్మ వన్డేల్లో ఏకంగా 264 పరుగులు చేసి.. ప్రపంచ క్రికెట్‌ ఓ అద్భుతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై రోహిత్‌ సృష్టించిన సునామీ ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డుగా ఉండిపోయింది. రోహిత్‌ 264 సునామీకి సరిగ్గా 8 ఏళ్లు పూర్తి అయిన రోజునే మంజునాథ్‌ వన్డే మ్యాచ్‌లో ఏకంగా 407 పరుగులు బాది మరో వరల్డ్‌ రికార్డును నమోదు చేశాడు. 2014 నవంబర్‌ 13న శ్రీలంక-భారత్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. అంతకు ముందు ఎవరూ కనివిని ఎరుగని రికార్డును సృష్టించాడు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సులు బాది 152కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 264 పరుగులు చేసి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసి ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. రోహిత్‌ శర్మ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను చేసిన రోజే (నవంబర్‌ 13) తన్మయ్‌ మంజునాథ్‌ 165 బంతుల్లోనే 48 ఫోర్లు, 24 సిక్సులతో 407 పరుగులు చేసి చరిత్ర సృష్టించడం విశేషం.

ఇదీ చూడండి: సరికొత్త లుక్స్​లో తారలు ఎవరబ్బా ఆ హెయిర్ స్టైలిష్ట్ భలే ముస్తాబు చేస్తున్నాడుగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.