ETV Bharat / sports

జంబో రికార్డుపై కన్నేసిన అశ్విన్​.. మరి సాధిస్తాడా?

author img

By

Published : Feb 25, 2023, 10:18 PM IST

Updated : Feb 25, 2023, 10:26 PM IST

ఇప్పటికే తొలి రెండు అద్భతమైన ప్రదర్శన చేస్తూ మంచి ఫామ్​లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్​కు.. మూడో టెస్టు ముందు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఆ వివరాలు..

Ravichandran Ashwin
మూడో టెస్టు ముందు అశ్విన్​ను ఊరిస్తున్న అరుదైన రికార్డు

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్​ సిరీస్​లో తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమ్​ఇండియా.. ప్రస్తుతం మూడో టెస్టు కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్​లోనూ గెలుపొందాలని పట్టుదలతో ఉంది. అలానే మరోవైపు తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమిని అందుకున్న ఆసీస్​ కనీసం మూడో మ్యాచ్​లోనైనా పోటీనిచ్చి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. మార్చి1వ తేదీ నుంచి ఇండోర్‌ వేదికగా ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో మనోళ్లు విజయం సాధిస్తే నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

అయితే ఈ మూడో టెస్టుకు ముందు సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టిన అశ్విన్​.. మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు సాధిస్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ మెగా ట్రోఫీలో అతడు 103 వికెట్లు తీశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమ్​ఇండియా దిగ్గజం అనిల్‌ కుంబ్లే 111 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అశ్విన్​ మరో ఎనిమిది వికెట్లు తీస్తే.. కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. అదే తొమ్మిది వికెట్లు తీస్తే.. జంబో రికార్డును అధిగమించి తొలి స్థానానికి చేరుకుంటాడు. అలా బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలుస్తాడు. మరి ఈ అరుదైన రికార్డు అతడు అధిగమిస్తాడో లేదో చూడాలి.

ఇక ఈ రికార్డు రేసులో ఆసీస్​ స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 102 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గానూ నిలిచాడు. అలా అతడు కూడా అశ్విన్​తో కలిసి కుంబ్లే రికార్డును బ్రేక్​ చేసేందుకు రెడీగా ఉన్నాడు. చూడాలి మరి ఇతడు ఏం చేస్తాడు. ఇకపోతే తల్లి అనారోగ్యం కారణంగా ప్యాట్​ కమిన్స్​ మూడో మ్యాచ్​కు దూరమయ్యాడు. స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో స్టీవ్​ స్మిత్​ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్ టాప్​-5 ప్లేయర్స్​ వీరే: గంగూలీ

Last Updated :Feb 25, 2023, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.