ETV Bharat / sports

IPL 2023 ​: దంచికొట్టిన కాన్వే, దుబే హాఫ్​ సెంచరీ.. బెంగళూరు టార్గెట్​ ఎంతంటే?

author img

By

Published : Apr 17, 2023, 9:19 PM IST

Updated : Apr 17, 2023, 10:06 PM IST

rcb vs csk innings
rcb vs csk innings

IPL 2023 ​: ఐపీఎల్​ 2023లో భాగంగా బెంగళూరు​​తో జరుగుతున్నమ్యాచ్​లో చెన్నై​ బ్యాటర్ డేవాన్​ కాన్వే దంచికొట్టాడు. శివమ్​ దుబే హాఫ్​ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరు టార్గెట్​ ఎంతంటే?

IPL 2023 ​: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా బెంగళూరు​తో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై​​​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. బెంగళూరు​కు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన చెన్నై​.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చెన్నై​ బ్యాటర్​​ డేవాన్​ కాన్వే​ (83) దంచికొట్టాడు. శివమ్​ దుబే (52) హాఫ్​ సెంచరీ చేశాడు. అజింక్య రహానే​ (37), అంబటి రాయుడు (14) పరుగులు చేశాడు. ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​(3) పేలవ ప్రదర్శన చేశాడు. మెయీన్​ అలీ (19*), జడేజా (10*) పరుగులు చేశారు. బెంగళూరు​ బౌలర్లలో మహ్మద్​ సిరాజ్​ (1), పార్వెల్​ (1), విజయ్​ కుమార్​ (1), హసరంగ (1), హర్షల్​ పటేల్​ (1), మ్యాక్స్​వెల్​ (1) వికెట్లు పడగొట్టారు.

రఫ్పాడించిన డేవాన్​ కాన్వే...
చైన్నై సూపర్​ కింగ్స్​ బ్యాటర్​ డేవాన్​ కాన్వే అద్భుత ప్రదర్శన చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సులతో రఫ్పాడించాడు. దాదాపు 184 స్ట్రైక్ రేట్​తో 45 బంతుల్లో 83 పరుగులు బాదాడు. ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ మయా చేస్తాడనుకున్నప్పటికీ.. కేవలం మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహాన్​... డేవిన్​కు మంచి భాగస్వామ్యం అందించాడు. ఇద్దరు కలసి స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించారు. పదో ఓవరల్​లో 37 పరుగులకు పెవిలియన్​ చేరాడు అజింక్య రహానే. దీంతో స్కోరుకు ఇక బ్రేకులు పడతాయని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత వచ్చిన శివమ్​ దుబే చెలరేగిపోయాడు. డేవిన్​తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిపోయాడు. మెరుపు షాట్లతో 27 బంతుల్లో హాఫ్​ సెంచరీ (52) పూర్తి చేశాడు. 178 పరుగుల వద్ద దుబే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు, మెయీన్​ అలీ, జడేజా, ధోనీ స్కోరును 226కు తీసుకెళ్లారు.

రికార్డు మిస్సైన ధోనీ..
ఈ మ్యాచ్​లో ఎమ్​ఎస్​ ధోనీ ఓ రికార్డు మిస్​ అయ్యారు. మరో 2 పరుగులు బాదితే.. ఆర్​సీబీపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా.. డేవిడ్​ వార్నర్​ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేవాడు. కానీ ఈ మ్యాచ్​లో ధోనీ ఒకే బంతి ఎదుర్కొని.. ఒక్క పరుగు మాత్రమే చేశారు. దీంతో రికార్డు బ్రేక్​కు మళ్లీ ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎమ్ఎస్​ ధోనీ(కెప్టెన్/వికెట్​ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్​ కీపర్​), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

Last Updated :Apr 17, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.