ETV Bharat / sports

IND vs SA Series: నెట్స్​లో రోహిత్, షమీ.. సౌతాఫ్రికా సిరీస్ కోసం రెడీ!

author img

By

Published : Dec 11, 2021, 11:12 AM IST

IND vs SA Series: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ షమీ నెట్స్​లో శ్రమిస్తూ కనిపించారు.

Rohit Sharma PRactice, Shami practice, షమీ ప్రాక్టీస్, రోహిత్ శర్మ ప్రాక్టీస్
IND vs SA Series

Rohit Sharma Practice: త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ట్రెయినింగ్ సెషన్‌లో త్రోడౌన్‌ స్పెషలిస్టులు విసిరిన బంతులను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొనేందుకుగానూ ఎక్కువగా పేస్‌, బౌన్స్ అయ్యే బంతులతో సాధన చేస్తున్నాడు హిట్‌మ్యాన్‌. ఆ వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు.

కాగా, టీమ్ఇండియా పేసర్ మహమ్మద్‌ షమీ కూడా సాధన షురూ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న అతడు అక్కడే బౌలింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. ఆ వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశాడు. కొద్దికాలంగా తీరిక లేకుండా క్రికెట్‌ ఆడుతున్న షమీ.. టీ20 ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

IND vs SA Series: ఓపెనర్‌ రోహిత్‌ శర్మను బీసీసీఐ ఇటీవల టీమ్ఇండియా వన్డే క్రికెట్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించింది. త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత కొద్దికాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న రహానేను బీసీసీఐ వైస్‌ కెప్టెన్సీ నుంచి తొలిగించారు. దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి: Ashes 2021: తొలి టెస్టులో ఇంగ్లాండ్​ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.