ETV Bharat / sports

Ashes 2021: తొలి టెస్టులో ఇంగ్లాండ్​ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

author img

By

Published : Dec 11, 2021, 9:14 AM IST

Ashes 2021: ఇంగ్లాండ్​తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.

Ashes 2021 latest news,  Australia beat England, ఇంగ్లాండ్​పై ఆస్ట్రేలియా విజయం, యాషెస్ 2021 న్యూస్
Ashes 2021

Ashes 2021: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​లో బోణీ కొట్టింది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్​తో బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్​లో 147 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 5 వికెట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు 425 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హెడ్ (152) భారీ శతకంతో పాటు వార్నర్ 94 పరుగులతో సత్తాచాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​కు 278 పరుగలు ఆధిక్యం సంపాదించింది.

Ashes 2021 Score Card: అనంతరం రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్​కు దీటుగా బదులిస్తున్నట్లు కనిపించింది ఇంగ్లీష్ జట్టు. మూడో రోజు కేవలం రెండే వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రూట్, మలన్ అద్వితీయంగా కనిపించారు. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే మలన్(82)​ను పెవిలియన్ పంపాడు లియోన్. కాసేపటికే రూట్ (89) ఔటయ్యాడు. అనంతరం పోప్ (4), స్టోక్స్ (14), బట్లర్ (23) జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్​లో 297 పరుగులకు పరిమితమైంది రూట్​సేన. ఆస్ట్రేలియా ముందు 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.

ఇవీ చూడండి: 'కొందరు నాకు పని లేకుండా చేయాలని చూశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.