ETV Bharat / sports

భారత్​ x అఫ్గాన్​ - ఇంట్రెస్టింగ్​గా ప్లేయింగ్​ 11 - ఆడేదెవరు? ఆగేదెవరు?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 6:55 AM IST

IND Vs AFG T20 : అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్​కు అంతా సిద్ధమవుతోంది. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్‌, కోహ్లి టీ20 జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ మ్యాచ్​లో ప్లేయింగ్ 11 అంచనాలు ఏలా ఉన్నాయంటే ?

IND Vs AFG T20
IND Vs AFG T20

IND Vs AFG T20 : పంజాబ్​లోని మొహాలీ వేదికగా భారత్​, ఆఫ్గానిస్థాన్​ టీ20 పోరు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే 16 మంది ఆటగాళ్లతో కూడిన ఓ భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అయితే అందులో రానున్న మ్యాచులకు ఏ 11 మంది ఆటగాళ్లను మ్యాచ్‌లో ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆ ప్లేయర్స్​ ఎవరంటే ?

ఈ టీ20తో ఈ ఫార్మాట్​లోకి మళ్లీ తిరిగొచ్చిన రోహిత్‌ అటు జట్టుకు సారధ్య బాధ్యతలు వహించడంతో పాటు ఇటు ఓపెనర్‌గానూ ఆడతాడు. అయితే అతడితో కలిసి సమర్థవంతంగా ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు మరో ప్లేయర్ కావాలి. ఇప్పటికే ఈ రేసులో యంగ్ ప్లేయర్స్ శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో శుభ్‌మన్‌, యశస్వి ఓపెనర్లుగా ఆడారు. కానీ ఇప్పుడు రోహిత్‌ రాకతో మరో ఓపెనర్‌గా వీళ్లిద్దరిలో ఒక్కరే తుది జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. ఇటీవలి పర్ఫామెన్స్​ను యశస్వినే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. చివరగా ఆడిన టీ20లోనూ (దక్షిణాఫ్రికాతో)లో అతడు 41 బంతుల్లోనే 60 పరుగులు స్కోర్ చేశాడు.

మరోవైపు రోహిత్‌తో కలిసి వన్డేల్లో జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్న శుభ్‌మన్ టీ20ల్లో మాత్రం పేలవ ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. గత 7 ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు 15.71 సగటుతో 110 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రకంగా చూస్తే యశస్వికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. పైగా అతను ఎడమ చేతి వాటం బ్యాటర్‌ కావడం వల్ల జట్టుకు కలిసొచ్చే అంశంగా మారనుంది. అయితే రోహిత్‌, గిల్‌ మధ్య మంచి సమన్వయం ఉంది కాబట్టి మరోసారి ఈ జోడీ ఓపెనింగ్‌ చేసే అవకాశాలను కూడా ఏ మాత్రం కొట్టిపారేయలేం.

ఇక తుది జట్టులో హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ ఉంటాడా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్‌ ఆర్డర్​లో ప్రస్తుతం మూడు నుంచి అయిదారు స్థానాల్లో తిలక్‌ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో ఎక్కువగా మూడో స్థానంలో ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు విరాట్‌ ఈ స్థానంలో బ్యాటింగ్‌ చేయనున్నాడు. ఆ తర్వాత సంజు శాంసన్‌, రింకు సింగ్‌, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్లేయింగ్​ 11లో తిలక్​ కు చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది. అయితే వికెట్‌ కీపర్‌గా జితేశ్‌ కంటే కూడా శాంసన్‌ ఆడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హార్దిక్‌ స్థానంలో మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె రావొచ్చు.

మరోవైపు పేస దళాన్ని అర్ష్‌దీప్‌ సింగ్‌ నడిపించనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20ల్లో ఉత్తమ ఫామ్​ను కనబరిచి ఆకట్టుకున్నాడు. మిగతా పేసర్లుగా ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, ఆడే ఆస్కారముంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో వాషింగ్టన్‌ను వెనక్కినెట్టి అక్షర్‌ పటేల్‌ వచ్చేలా కనిపిస్తున్నాడు. మరో స్పిన్నర్‌ స్థానం కోసం కుల్‌దీప్‌, రవి బిష్ణోయ్‌ మధ్య పోటీ జరగనుంది. సౌతాఫ్రికాతో టీ20ల్లో రాణించిన కుల్‌దీప్‌కే ఈ సారి కూడా చోటు దక్కే అవకాశముంది.

పొట్టి కప్, ఎన్నో సిరీస్​లు- 2024లో ఫుల్ మజా- భారత్ పూర్తి షెడ్యూల్ ఇదే!

టీ20 వరల్డ్​కప్​ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్​- కెప్టెన్​ ఛాన్స్ అతడికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.