ETV Bharat / sports

వికెట్లు తీసిన రోహిత్​, కోహ్లీ- ఒకే మ్యాచ్​లో 9 మంది బౌలింగ్​, 31 ఏళ్ల తర్వాత రికార్డ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 7:58 AM IST

Updated : Nov 13, 2023, 9:16 AM IST

India Vs Netherlands World Cup 2023 : ఆదివారం నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసి ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కొందరు స్టార్​ బ్యాటర్లు బౌలింగ్​ చేసి వికెట్లు సాధించారు. అంతేకాకుండా 31 ఏళ్ల తర్వాత 9 మంది బౌలింగ్​ చేయడం విశేషం. ఆ వివరాలు..

India Vs Netherlands World Cup 2023
India Vs Netherlands World Cup 2023

India Vs Netherlands World Cup 2023 : 2023 వన్డే ప్రపంచ కప్​లో ఆదివారం ఆసక్తికరమైన మ్యాచ్​ జరిగింది. నెదర్లాండ్స్​తో తలపడిన భారత్​ 160 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. పండగలా సాగిన ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు. ఇక స్టార్​ బ్యాటర్లుకూడా బౌలింగ్​ వేసి వికెట్లు పడగొట్టారు. అందులో ముఖ్యంగా తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్‌తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్​లో 'కింగ్​' విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్ కూడా పడగొట్టాడు. 9 ఏళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో వికెట్ సాధించాడు.

బంతితో రో'హిట్'..
చాలా కాలం తర్వాత బౌలింగ్ చేసిన రోహిత్.. మొదటి ఓవర్‌లోనే వికెట్. ఒకప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా సత్తా చాటిన హిట్​మ్యాన్​.. గాయం కారణంగా బౌలింగ్ వేయడం మానేశాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత వికెట్​ పడగొట్టాడు. రోహిత్​ చివరగా 2012లో ఆసీస్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో వికెట్​ తీశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్​లో రోహిత్​ ఇప్పటివరకు 9 వికెట్లు తీశాడు. అంతేకాకుండా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్​ కప్​లో వికెట్​ తీసిన భారత సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు.

9 మంది బౌలింగ్..
నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో మరో ఆసక్తిక ఘటన జరిగింది. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా తరఫున మొత్తం 9 బౌలింగ్ చేశారు. వికెట్​ కీపర్ కేఎల్ రాహుమ్​, శ్రేయస్ అయ్యర్ మినహా.. అందరూ బౌలింగ్​ వేయడం విశేషం. అంతేకాకుండా వన్డే వరల్డ్​ప్‌లో ఒక మ్యాచ్‌లో 9 మంది బౌలింగ్ వేయడం ఇది మూడోసారి. 1987లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లు తొమ్మిది మంది బౌలింగ్ చేశారు. 1992 వరల్డ్​ కప్‌ మొగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున 9 మంది బౌలింగ్ చేశారు. 31 ఏళ్ల తర్వాత రోహిత్ సేన 9 మంది బౌలింగ్​ చేసి.. రికార్డును సమం చేసింది.

రాయుడు, బెన్​స్టోక్స్​కు చెన్నై గుడ్​బై - 2024 ఐపీఎల్ ప్లేయర్ల రిలీజ్ లిస్ట్ ఇదే​

నెదర్లాండ్స్​పై భారత్ గ్రాండ్ విక్టరీ టోర్నీలో వరుసగా తొమ్మిదో విజయం నమోదు

Last Updated :Nov 13, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.