ETV Bharat / sports

గాలి నిన్ను తాకింది.. నేను నిన్ను తాకితే తప్పా?

author img

By

Published : Jan 31, 2020, 10:16 PM IST

Updated : Feb 28, 2020, 5:18 PM IST

బిగ్​బాష్​ లీగ్​లో ఎప్పుడూ ఆసక్తిరక సంఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ హిట్​ వికెట్​ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈరోజు మెల్‌బోర్న్‌ స్టార్స్‌-సిడ్నీ సిక్సర్స్​ మ్యాచ్​లో ఈ విశేషం జరిగింది.

BBL Team Celebrates Steve Smith's Hit Wicket Dismissal, But He Remains Not Out
గాలి నిన్ను తాకింది.. నేను నిన్ను తాకితే తప్పా..?

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా నేడు మెల్‌బోర్న్‌ స్టార్స్‌-సిడ్నీ సిక్సర్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్​ మ్యాచ్​ జరిగింది. ఇందులో ఓ హిట్‌ వికెట్‌ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. సిడ్నీ సిక్సర్స్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ బంతిని తప్పించుకునే క్రమంలో వికెట్లను చేతితో పడగొట్టాడు. అయితే థర్డ్​ అంపైర్ దాన్ని​ నాటౌట్​గా ప్రకటించాడు. ఎవరైనా బ్యాట్స్​మన్​ వికెట్లను తాకి బెయిల్స్​ పడితే హిట్​ వికెట్​గా ప్రకటిస్తారు. కానీ ఈ మ్యాచ్​లో ప్రకటించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇదీ జరిగింది...!

మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బౌలర్​ హరిస్‌ రాఫ్‌ బౌన్సర్​ సంధించగా... దాన్ని స్మిత్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే స్మిత్‌ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లాడు. వెంటనే బెయిల్స్‌ కిందిపడిపోయాయి. అప్పటికి ఇంకా ఆ స్టార్​ ప్లేయర్​ పరుగుల ఖాతా తెరవలేదు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఫీల్డ్‌ అంపైర్లు ఔట్​పై థర్డ్​ అంపైర్‌ను సంప్రదించగా అది నాటౌట్‌గా తేల్చాడు. స్మిత్‌ వికెట్లను తాకడానికి కంటే ముందుగానే గాలి కారణంగా బెయిల్స్‌ పైకి లేచినట్లు అతడు భావించాడు. ఫలితంగా నాటౌట్‌గా ప్రకటించాడు.

ఈ మ్యాచ్​లో స్మిత్‌... 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్​తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 99 పరుగులకే ఆలౌట్‌ కావడం వల్ల పరాజయం పాలైంది. ఫలితంగా సిడ్నీ సిక్సర్స్‌ ఫైనల్‌కు చేరగా, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమౌతోంది.

ఇదీ చూడండి...

ఈ బ్యాట్స్​మన్ దురదృష్టం మాములుగా లేదు!

Last Updated :Feb 28, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.