ETV Bharat / sports

రవిశాస్త్రిపై చర్యలు.. దాదా ఏమన్నాడంటే?

author img

By

Published : Sep 14, 2021, 4:35 PM IST

టీమ్​ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై(ravi shastri corona) ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని తెలిపాడు బీసీసీఐ అధ్యుక్షుడు గంగూలీ. ఐదో టెస్టు​ రద్దుపై(Fifth Test cancelled) వస్తోన్న విమర్శలకు మరోసారి వివరణ ఇచ్చాడు.

dada
దాదా

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిపై(ravi shastri corona) ఎలాంటి చర్యలు తీసుకోబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ(ganguly england) స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రి ఓవల్‌లోని హోటల్లో బసచేస్తుండగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, పుస్తకావిష్కరణకు సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి పొందలేదని.. అయినా రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నాడు.

"ఎవరైనా ఎంతసేపని హోటల్‌ గదిలో ఉంటారు? మీరు ఒక రోజు మొత్తం ఇంట్లో, మరోరోజు మొత్తం బయట ఉండగలరా?ఎవరైనా హోటల్‌ గదిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆపలేం. అది జరగని పని. నేను తాజాగా ఒక షూటింగ్‌లో పాల్గొన్నా. అక్కడొక 100 మంది ఉన్నారు. అందరూ డబుల్‌ డోస్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. అయినా, ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. వాక్సినేషన్‌ తీసుకున్నా చాలా మంది వైరస్‌బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇలా ఉంది"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ఐదో టెస్టుకు(team india england tour) ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు భయపడ్డారని, తమతో ప్రాక్టీస్‌ సెషన్‌లో సన్నిహితంగా మెలిగిన ఫిజియో యోగేశ్‌ పార్మర్‌కు పాజిటివ్‌గా తెలియడం వల్ల కంగారు పడ్డారని దాదా పేర్కొన్నాడు. తొలుత నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రికి(ravi shastri corona) పాజిటివ్‌గా తేలింది. ఆపై బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌తో పాటు మరో ఫిజియో నితిన్‌ పటేల్‌ సైతం వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఐదో టెస్టుకు ముందు యోగేశ్‌కు కూడా నిర్ధరణ కావడం వల్ల ఆటగాళ్లు భయపడి మ్యాచ్‌లో ఆడలేదని గంగూలీ వివరించాడు. అందులో వాళ్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదని, వాళ్ల మనసుల్ని అర్థం చేసుకోవాలని తెలిపాడు. అలాగే రద్దయిన చివరి టెస్టును భవిష్యత్తులో ఎప్పుడు నిర్వహించినా.. దాన్ని ఐదో టెస్టుగానే పరిగణించాలని మాజీ సారథి అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి: ఐదో టెస్టు రద్దు.. విమర్శలపై దాదా కౌంటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.