ETV Bharat / sports

Ashes 2021-22: ఇంగ్లాండ్​ జట్టుపై జరిమానా.. కారణమిదే..

author img

By

Published : Dec 11, 2021, 3:56 PM IST

Ashes 2021-22: యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు ఐసీసీ నియమాలను ఉల్లంఘించింది. స్లో ఓవర్​ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోతకు గురైంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్​పై కూడా జరిమానా పడింది.

england team
ఇంగ్లాండ్ జట్టు

Ashes 2021-22: యాషెస్​ సిరీస్​లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్​ రేట్ కారణంగా ఇంగ్లాండ్​పై జరిమానా పడింది. అసభ్య పదజాలం ఉపయోగించిన కారణంగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్​ హెడ్​పై కూడా మ్యాచ్​ ఫీజులో కోత విధించారు అధికారులు.

ఐదు పాయింట్లు కోల్పోయి..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఐదు ఓవర్లు స్లోగా వేసింది. దీంతో మ్యాచ్​ రిఫరీ డేవిడ్ బూన్ ఇంగ్లాండ్​ జట్టు మ్యాచ్​ ఫీజుపై 100 శాతం కోత విధించాడు. ఐసీసీ నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లపై ప్రతి స్లో ఓవర్​కు 20 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొన్నాడు బూన్. అయితే.. ఈ కారణంగానే ఇంగ్లాండ్​ వరల్డ్​ టెస్టు ఛాంపియన్స్​లో ఐదు పాయింట్లు కోల్పోయింది.

మరోవైపు తొలి టెస్టులో 'ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్'గా నిలిచిన ట్రావిస్ హెడ్​.. ఆసీస్ ఇన్నింగ్స్ 77వ ఓవర్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఐసీసీ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.3 ప్రకారం అతడికి మ్యాచ్​ ఫీజుపై 15 శాతం కోత విధించి, ఓ డీమెరిట్​ పాయింట్​ ఇచ్చారు మ్యాచ్ రిఫరీ.

ఆస్ట్రేలియా అలవోకగా..

యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. తద్వారా 1-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది ఆసీస్. ఈ ఎడిషన్​లో తొలి సిరీస్​ ఆడుతున్న ఆసీస్​కు ఈ మ్యాచ్​లో విజయంతో 12 పాయింట్లతో పాటు 100 పర్సంటేజ్ లభించింది.

ఇదీ చదవండి:

పది నెలల నిరీక్షణ ఫలించింది.. రికార్డు దక్కింది!

ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.