ETV Bharat / sports

డబ్ల్యూటీఎఫ్​ ఆరంభ మ్యాచ్​ల్లో సింధు, శ్రీకాంత్​ ఓటమి

author img

By

Published : Jan 27, 2021, 3:33 PM IST

Updated : Jan 27, 2021, 6:18 PM IST

ప్రపంచ టూర్ ఫైనల్స్​ ఆరంభ మ్యాచ్​ల్లో భారత షట్లర్లు​ సింధు, శ్రీకాంత్​లు పరాజయం పాలయ్యారు. చైనీస్​ తైపీ​ ప్లేయర్​ తై జు యింగ్​ చేతిలో 21-19,12-21,17-21 తేడాతో సింధు ఓటమిని చవిచూసింది. అండర్స్ అంటోన్సెన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ ఓడిపోయాడు.

World Tour Finals: Sindhu loses to Tzu Ying in 1st group game
డబ్ల్యూటీఎఫ్​ ఆరంభ మ్యాచ్​ల్లో సింధు, శ్రీకాంత్​ ఓటమి

ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబీ శ్రీకాంత్‌కు ఆరంభ మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-బీలో ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌‌ తై జు యింగ్‌తో తలపడిన మ్యాచ్‌లో సింధు ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో 21-19తో తెలుగు తేజం పైచేయి సాధించగా.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి 21-12తో విజయం సాధించింది.

నిర్ణయాత్మక మూడోగేమ్‌లో తొలుత తైజు 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు గొప్పగా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. కానీ కొన్ని పొరపాట్లతో సింధు మరోసారి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. 17-21తో ఆ గేమ్‌ను మ్యాచ్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు తై జు యింగ్‌తో సింధు 21 మ్యాచ్‌ల్లో తలపడగా 16 సార్లు ఓటమిపాలైంది. తన తర్వాతి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతానన్‌ రచనోక్‌తో సింధు తలపడనుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బీలో ప్రపంచ నంబర్‌-3 ఆటగాడు అండర్స్ అంటోన్సెన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్‌ 21-15, 16-21, 18-21తో ఓటమిని చవిచూశాడు. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన షట్లర్లు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.

భారీ ప్రైజ్​ మనీ..

ఈ ఏడాది.. ప్రపంచ టూర్​ ఫైనల్స్​ ప్రైజ్​ మనీని రూ.10.94 కోట్లుగా నిర్ణయించారు. మొదటి 8 ర్యాంకుల్లో నిలిచిన ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడటానికి అర్హులు. పురుషుల, మహిళల సింగిల్స్​తో పాటు డబుల్స్​, మిక్స్​డ్​ డబుల్స్​ నుంచి ప్లేయర్ల ఎంపిక ఉంటుంది.

ఎనిమిది మందిని ఆటగాళ్లను నలుగురు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపు మ్యాచ్​లు రౌండ్​ రాబిన్​ ఫార్మాట్లో జరుగుతాయి. ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నవాళ్లు సెమీస్​కు అర్హత సాధిస్తారు.

తన కెరీర్​లో నాలుగు ఫైనల్స్​లో ఆడిన సింధు.. 2018లో విజేతగా నిలిచింది.

ఇదీ చదవండి: మరోసారి ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన గంగూలీ

Last Updated :Jan 27, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.