ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి యాక్సిడెంట్ జరిగే అవకాశం! జాగ్రత్త! - Horoscope Today May 27th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 5:00 AM IST

Horoscope Today May 27th 2024 : మే​ 27న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 27th 2024
Horoscope Today May 27th 2024 (ETV Bharat)

Horoscope Today May 27th 2024 : మే​ 27న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మీరు అనవసరమైన వాదనలు, అర్థంలేని చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులు ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. తీరికలేని పనితో అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే సన్నిహితులతో కలహాలకు ఆస్కారముంది. పనిలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త మొదలు పెట్టాల్సిన పనులను వాయిదా వేయండి. హనుమాన్ చాలీసా పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మాతృవర్గం వారి నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ అదుపులేని కోపం కారణంగా శత్రువులు పెరుగుతారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగల మీ ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ అదుపులేని కోపం కారణంగా శత్రువులు పెరుగుతారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగల మీ ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొత్త ప్రా జెక్టులు మొదలు పెట్టేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సమాజంలో గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగు తాయి. ఇంట్లో కలహాలు చికాకు కలిగిస్తాయి. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో గొడవలు అశాంతిని కలిగిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సహనంతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వివాదాలకు, వాదనలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సర్వత్రా విజయం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడిన మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు తమ రంగాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు సామాజికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆర్థికపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రోజంతా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. గణపతి ఆరాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.