ETV Bharat / snippets

పాపం కావ్య పాప ఏడ్చేసింది- బీ స్ట్రాంగ్ మేడమ్ జీ!

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 7:52 AM IST

Kavya Maran Cry
Kavya Maran Cry (Source: Associated Press)

Kavya Maran Cry: 2024 ఐపీఎల్​ ఫైనల్​లో సన్​రైజర్స్ ఓటమి అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారాన్ కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్​లో అత్యుత్తమంగా రాణించి టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలిచిన సన్​రైజర్స్ ఫైనల్​లో ఓడడం వల్ల కావ్యా భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే నిలబడి చప్పట్లు కొట్టిన కావ్యా వెంటనే వెనక్కి తిగిరి ఎడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. సీజన్​ మొత్తం ఎంతో సంతోషంగా స్టేడియంలో సందడి చేసిన కావ్య ఇలా కంటతడి పెట్టడంతో ఆమె ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. కాగా, ఫైనల్​లో సన్​రైజర్స్​పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ పట్టేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.